పెరిగిన సైబర్‌ మోసాలు

ABN , First Publish Date - 2022-12-09T23:41:52+05:30 IST

ఇటీవల కాలంలో సైబర్‌ మోసాలు పెరిగాయి. ఖాతాదారులకు తెలియకుం డానే బ్యాంక్‌ ఖాతాలలో నగదు మాయం అవుతు న్నాయి.

పెరిగిన సైబర్‌ మోసాలు

ఖాతాదారులకు తెలియకుండానే నగదు మాయం

అద్దంకి, డిసెంబరు 9: ఇటీవల కాలంలో సైబర్‌ మోసాలు పెరిగాయి. ఖాతాదారులకు తెలియకుం డానే బ్యాంక్‌ ఖాతాలలో నగదు మాయం అవుతు న్నాయి. ఇటీవల అద్దంకిలో చోటు చేసుకున్న పలు సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నా యి. పట్టణంలోని అభ్యుదయనగర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు భార్య ఖాతా నుంచి సుమారు రూ.80 వేలు మాయమయ్యాయి. తీరా బ్యాంకులో విచారణ చేస్తే అసలు మోసం ఎలా జరిగిందో కూడా వెల్లడి కాలేదు.

అద్దంకి ఎల్‌ఐసీ కార్యాలయంలో డెవలెప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచే స్తున్న సోమా రాజశేఖరరెడ్డికి ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉంది. మూడు రోజుల క్రితం క్రెడిట్‌ కార్డు ద్వారా సుమారు రూ.86,500 రెండు విడత లుగా డ్రా అయినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. బ్యాంక్‌ సర్వీస్‌ సెంటర్‌ల ద్వారా జరుగుతున్న నగదు లావా దేవీలలో కూడా మోసాలు చోటుచేసుకుం టున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.

అద్దంకి పట్టణంలోని ఓ బ్యాంక్‌ సర్వీస్‌ సెంటర్‌ నిర్వహకుడు అమాయకులైన ఖాతా దారుల నుంచి తరచూ నగదు డ్రా చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఉపాధి హామీ నగ దుతో పాటు ఇతర నగదు కూడా ఖాతాదారు ల ఖాతా నుంచి తంబ్‌ వేయించి నగదు డ్రా చేస్తున్నారు.

ఖాతాదారులకు మొత్తం నగదు ఇవ్వకుం డా కొంత మొత్తాన్ని నొక్కేసి, కొద్ది మొత్తాన్ని మాత్రం ఖాతాదారులకు ఇస్తూ మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తు న్నాయి. ఇలా పలువురు మోసపోతున్నారు. తరచూ మోసాలు జరు గుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సెల్‌ఫోన్‌కు కనీసం ఓటీపీ రాకుండా కూడా నగదు డ్రా జరుగుతుండటంతో ప్రజలు బెంబే లెత్తుతున్నారు.

Updated Date - 2022-12-09T23:41:59+05:30 IST