నష్టపోయిన పొగాకు రైతులకు తక్షణసాయం

ABN , First Publish Date - 2022-12-15T23:22:53+05:30 IST

మాండస్‌ తుఫాన్‌తో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి తక్షణ సాయం అందించి తిరిగి పంట సాగు చేసేలా చూడాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు గురువారం ఇక్కడి పొగాకు బోర్డు ఆర్‌ఎం కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు, కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ను కలిసి కోరారు. ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో పొగాకు సాగు చేయగా మాండస్‌ తుఫాన్‌తో 80వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని పంట పూర్తిగా ధ్వంసమైందన్నారు.

నష్టపోయిన పొగాకు రైతులకు తక్షణసాయం

ఒంగోలు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మాండస్‌ తుఫాన్‌తో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి తక్షణ సాయం అందించి తిరిగి పంట సాగు చేసేలా చూడాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు గురువారం ఇక్కడి పొగాకు బోర్డు ఆర్‌ఎం కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు, కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ను కలిసి కోరారు. ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో పొగాకు సాగు చేయగా మాండస్‌ తుఫాన్‌తో 80వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని పంట పూర్తిగా ధ్వంసమైందన్నారు. ఎకరాకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకు ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులు రైతులు నష్టపోయారని ఈడీ దృష్టికి తీసుకెళ్లారు. దెబ్బతిన్న తోటలు తొలగించి తిరిగి మొక్కలు వేసుకోవాల్సిన అవసరం ఉండగా చేతిలో డబ్బు లేక వేలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో తక్షణం పంట సాగుకు వీలుగా బ్యారన్‌కు కనీసం రూ.50వేలు వడ్డీ లేని రుణం అందించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేరి రూ.20వేల వంతున ఆర్థిక సాయం చేసేలా చూడాలని కోరారు. అలాగే బోర్డు వద్ద ఉన్న నిధుల నుంచి కూడా సాయం అందించడంతోపాటు ఏడాదిగా పొగాకు రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్‌ చేయాలని కోరారు. మరో వైపు పొగాకు పంటకు బీమా లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. కనుక పొగాకు పంటకు కూడా బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయా అంశాలపై సానుకూలంగా స్పందించిన ఈడీ శ్రీధర్‌బాబు పంట నష్టాలను త్వరితగతిన అంచనా వేసి బోర్డు ద్వారా రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంటకు బీమా, ధరలు విషయంలో కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈడీని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డాక్టర్‌ డీఎ్‌సబీవీ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌విజయకుమార్‌, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్య పలువురు ఇతర నేతలు ఉన్నారు.

రైతుల గోడు పట్టని మంత్రులు

మాండ్‌సతో పంటలన్ని దెబ్బతిని కోలుకోలేని విధంగా రైతులు దెబ్బతిన్న కనీసం నష్టాలను పరిశీలించి రైతులను ఓదార్చేందుకు కూడా మంత్రులు రాలేదని టీడీపీ శాసనసభా పక్ష విప్‌, కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి విమర్శించారు. ఇక్కడి పొగాకు బోర్డు ఆర్‌ఎం కార్యాలయం వద్ద పార్టీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌ విజయకుమార్‌ ఇతర నేతలతో కలిసి మీడియాతో స్వామి మాట్లాడారు. జిల్లాలో పొగాకు, మిర్చి, మినుము, కంది, వరి, శనగ ఇలా అన్ని పంటలు దెబ్బతిని రైతాంగం వందల కోట్లు నష్టపోయారన్నారు. జిల్లా మంత్రి సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు తప్ప పంట నష్టాలు పరిశీలించి రైతులను ఓదార్చడం.. అధికారులతో సమీక్షించి సత్వర సాయం అందించే చర్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జిల్లా ఇన్‌చార్జీ మంత్రి పక్క జిల్లాకు చెందిన వారే అయినా ఇక్కడి రైతుల పరిస్థితిని పట్టించుకోలేదన్నారు. ఇక వ్యవసాయశాఖ మంత్రి నెల్లూరు నుంచి అమరావతికి జిల్లాపైనుంచే వెళ్ళి వస్తున్నా ఇక్కడ పంట నష్టాలు చూసే తీరిక లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం పంట నష్టాలపై ఉదారంగా వ్యవహరించి వాస్తవానికి అనుగుణంగా రైతులకు సాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-15T23:22:55+05:30 IST