విద్యుత్‌ వాడితే వాతే!

ABN , First Publish Date - 2022-04-10T06:42:02+05:30 IST

పరిశ్రమలకు పవర్‌ కట్‌ విషయంలో విద్యుత్‌ శాఖాధికారులు రోజుకో రకంగా వ్యవహరిస్తున్నారు.

విద్యుత్‌ వాడితే వాతే!

 గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు అధికారుల తాజా ఆదేశాలు

చీమకుర్తి, ఏప్రిల్‌ 9: పరిశ్రమలకు పవర్‌ కట్‌ విషయంలో విద్యుత్‌ శాఖాధికారులు రోజుకో రకంగా వ్యవహరిస్తున్నారు. వారంలో రెండురోజులు పవర్‌ హాలిడే, ప్రతిరోజూ సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని జారీచేసిన ఆదేశాలను విద్యుత్‌ శాఖాధికారులు అమలు చేయటంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. మర్రిచెట్లపాలెం సబ్‌స్టేషన్‌ పరిధిలో పరిశ్రమలకు, గృహ అవసరాలకు వేర్వేరుగా సరఫరా ఏర్పాట్లు లేకపోవటంతో ఒక్క రోజులేనే యూటర్న్‌ తీసుకున్నారు. తాజాగా గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. రోజూ యథావిధిగా సరఫరా చేసినా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ప్రక్రియ చేపట్టకూడదని, ఒకవేళ  ఉత్తర్వులను ఉల్లంఘిస్తే భారీ పెనాల్టీలు విధిస్తామని గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులను హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మర్రిచెట్లపాలెం పరిధిలోని పరిశ్రమలకు శుక్రవారం సాయంత్రం పవర్‌ ఆఫ్‌ చేశారు. దీనిపై ఏడీఈ గుర్నాథంను వివరణ కోరగా మౌఖిక ఆదేశాలు జారీచేయడం వాస్తవమేనన్నారు. 

Updated Date - 2022-04-10T06:42:02+05:30 IST