అపారనష్టం..!

ABN , First Publish Date - 2022-12-13T22:34:09+05:30 IST

తుఫాన్‌ ప్రభావం వ లన కురిసిన వర్షాలకు పంటలు నిలువునా నీట మునిగాయి. అపారనష్టం సంభవించ డం తో రైతులు అల్లాడి పోతున్నారు. నీట ము నిగిన పంటలను కాపాడుకునేందకు ఏం చే యాలో పాలుపోక తలలుపట్టుకుంటున్నారు.

అపారనష్టం..!
పొలం వద్ద రోదిస్తున్న మిర్చి రైతు

నిలువునా మునిగిన పంటలు

అల్లాడుతున్న అన్నదాతలు

దర్శి, డిసెంబరు 13 : తుఫాన్‌ ప్రభావం వ లన కురిసిన వర్షాలకు పంటలు నిలువునా నీట మునిగాయి. అపారనష్టం సంభవించ డం తో రైతులు అల్లాడి పోతున్నారు. నీట ము నిగిన పంటలను కాపాడుకునేందకు ఏం చే యాలో పాలుపోక తలలుపట్టుకుంటున్నారు. దర్శి ప్రాంతంలో మిర్చి, పొగాకు, కంది, వరి, శ నగ మొక్కజొన్న పంటలు విస్తారంగా సాగు చేశారు. మిర్చి పంట కాపుకాసి కోతలు కోస్తు న్న సమయంలో భారీ వర్షాలు పడడంతో తోట లు ఉరకెత్తాయి. కాయలు పూర్తిగా దెబ్బతి న్నా యి. దర్శి మండలం, తూర్పువీరాయిపాలెం గ్రా మానికి చెందిన తానికొండ శ్రీనివాసరావు అనే రైతు ఐదు ఎకరాల మిర్చి పంట సాగు చేసి రూ.4 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. వర్షా లకు పంట పూర్తిగా దె బ్బతినడంతో చేను వ ద్దనే కన్నీరుమున్నీరుగా విలపి స్తున్నారు. మండలంలో సు మారు రెండు వేల ఎకరాల కు పైగా మిర్చి పంట దెబ్బ తిన్నదని రైతులు చెప్తు న్నా రు. కొట్టుడుకొచ్చిన వైట్‌ బర్లీ పొగాకు తడిసి ఎందుకూ పనికి రాకుండా పోయింది. పూత పిందే దశలో ఉన్న కందిపైరు పూత, పిందె దశలో ఉన్న పైరు రాలిపోవడంతో మళ్లీ కాపు నకు వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెల కొంది. సుమారు మూడు వేల ఎకరాల్లో కంది పైరు దెబ్బతిన్నట్లు చెప్తున్నారు. శనగ, అల సంద పైర్లు నీట మునిగాయి. అధిక వర్షాలకు ఈ పైర్లు పూర్తిగా దెబ్బతినడంతో మళ్లీ ప్రత్యా మ్నాయ పంటలు సాగు చేసుకోవాల్సిన పరి స్థితి నెలకొంది. సుమారు రెండు వేల ఎకరాల్లో శనగ, 1000 ఎకరాల్లో అలసంత దెబ్బతిన్నట్లు చెప్తున్నారు. వర్షాల వలన పంటలకు భారీ న ష్టం సంబంవించినా వ్యవసాయాధికారులు న ష్టాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చే స్తున్నారు. అధికారుల నివేదికల ప్రకారం మిర్చి 80 ఎకరాలు, పొగాకు 180 ఎకరాలు, శనగ 900 ఎకరాలు, అలసంద 100 ఎకరాల్లో మా త్రమే దెబ్బతిన్నట్లు చెప్తున్నారు. కంది పంట న ష్టాన్ని వారు పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవా లని నష్టపోయిన రైతులు వేడుకుంటున్నారు.

Updated Date - 2022-12-13T22:34:09+05:30 IST

Read more