మౌలిక వసతులు కల్పించకుండా ఎలా వెళ్లాలి!

ABN , First Publish Date - 2022-12-15T23:53:19+05:30 IST

పూర్తి స్థాయిలో ఇళ్ళ స్థలాలు కేటాయించ కుండా, పునరావాస కాలనీలలో మౌలిక వసతులు కల్పించకుండా ముంపు గ్రామాలు ఖాళీచేసి ఎలా వెళ్ళాలని అధికారులను మణికేశ్వ రం గ్రామస్థులు ప్రశ్నించారు.

మౌలిక వసతులు కల్పించకుండా ఎలా వెళ్లాలి!

అధికారులను ప్రశ్నించిన మణికేశ్వరం గ్రామస్థులు

అద్దంకి, డిసెంబరు 15: పూర్తి స్థాయిలో ఇళ్ళ స్థలాలు కేటాయించ కుండా, పునరావాస కాలనీలలో మౌలిక వసతులు కల్పించకుండా ముంపు గ్రామాలు ఖాళీచేసి ఎలా వెళ్ళాలని అధికారులను మణికేశ్వ రం గ్రామస్థులు ప్రశ్నించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ముంపు గ్రా మాలను ఖాళీ చేయించేందుకు అధికారులు ఆయా గ్రామాలలో నిర్వ హిస్తున్న గ్రామసభలలో భాగంగా గురువారం మండలంలోని మణికే శ్వరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌డీసీ ఉమాదేవి మాట్లా డుతూ ఇంకా గ్రామాన్ని ఎందుకు ఖాళీ చేయలేదని గ్రామస్థులను ప్రశ్నించారు. దీంతో గ్రామస్థులందరూ ముక్తకంఠంతో సమాధానమి స్తూ అందరం ఖాళీ చేసి పునరావాస కాలనీలకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంకా ఎస్సీ కాలనీకి స్థలాల కేటాయింపు జరగలేదని, గ్రామంలో ఇంకా 50 మందికి స్థలాలు ఇవ్వాల్సి ఉందన్నారు. పునరా వాస కాలనీలో కనీస మౌలిక వసతులయిన విద్యుత్‌, మంచినీటి సౌ కర్యం లేవన్నారు. పునరావాస కాలనీలలో ప్రభుత్వమే ఇంటి నిర్మాణా లు చేసి ఇవ్వాలని, మసీదు, సామాజిక వర్గాల వారీగా శ్మశానాలకు స్థలాలు కేటాయించాలని టీడీపీ నేతలు కరిముల్లా తదితరులు అధి కారుల దృష్టికి తీసుకుపోయారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సుబ్బా రెడ్డి, సర్పంచ్‌ మందా రూతుమేరి, ఎంపీటీసీ దాసరి డాన్యూల్‌, సొసై టీ అధ్యక్షుడు సోమా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:53:27+05:30 IST