ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-07-31T05:11:37+05:30 IST

నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిష్కాఆనికి తొలిప్రాధాన్యత ఇస్తున్నట్టు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెం కటేష్‌ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం
ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై కరపత్రాలు అందజేస్తున్న వెంకటేష్‌

 వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌

చీరాల, జూలై 30: నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిష్కాఆనికి తొలిప్రాధాన్యత ఇస్తున్నట్టు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెం కటేష్‌ అన్నారు. అన్ని సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తు న్నట్టు చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భా గంగా శనివారం 24వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సం క్షేమ, అభివృద్ధి పథకాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేశారు. ముందుగా వార్డు వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో వాయా వార్డుల స్థితిగతులపై సమీక్షించారు. 

అనంతరం వార్డులో పర్యటించారు. ఏమై నా సమస్యలు ఉంటే నేరుగా చెప్పాలని స్థానికులను కోరారు. అర్హతే ఆధారంగా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. అర్హత ఉండీ పథకాల ఫలాలు అందకపోతే వెంటనే దరఖాస్తు చేసు కోవాలని చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read more