చేతివృత్తుల వారికి చేయూత

ABN , First Publish Date - 2022-08-04T07:13:07+05:30 IST

రువ్యాపారులు, చేతివృత్తుల వారికి జగనన్న తోడు పథకం ద్వారా ప్రభుత్వం చేయూత అందిస్తున్నదని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

చేతివృత్తుల వారికి చేయూత
లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ 

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 3 : చిరువ్యాపారులు, చేతివృత్తుల వారికి జగనన్న తోడు పథకం ద్వారా ప్రభుత్వం చేయూత అందిస్తున్నదని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం జగనన్న తోడు పఽథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఐదో విడత రుణాలు, వడ్డీ జమచేస్తున్న సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మేయర్‌ గంగాడ సుజాతతో కలిసి లబ్ధిదారులకు  చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 24,606మందికి రూ.10వేల చొప్పున రూ.24.60కోట్ల బ్యాంకు రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. 46,974మందికి రూ.67లక్షల వడ్డీని వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నట్లు తెలిపారు. రూ.3.11కోట్ల వడ్డీ మాఫీ అయిందని ఆయన పేర్కొన్నారు. ఇన్‌చార్జ్‌ డీఆర్వో సరళావందనం, డీఆర్‌డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ రవికుమార్‌, ఎల్‌డీఎం యుగంధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T07:13:07+05:30 IST