సరస్వతీ నమస్తుభ్యం..

ABN , First Publish Date - 2022-10-03T05:05:53+05:30 IST

దసరా శరన్నవ రాత్రులలో భాగంగా ఆదివారం పలు గ్రా మాలలో ఉన్న దేవతామూర్తులు సరస్వతి దే వీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

సరస్వతీ నమస్తుభ్యం..
అద్దంకిలోని కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో సరస్వతిదేవిగా అమ్మవారు

బల్లికురవ, అక్టోబరు 2: దసరా శరన్నవ రాత్రులలో భాగంగా ఆదివారం పలు గ్రా మాలలో ఉన్న దేవతామూర్తులు సరస్వతి దే వీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మండలంలోని కొండాయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న గంగాపార్వతి సమేత నీలకం ఠేశ్వర స్వామి దేవాలయంలో పూజారి స్వర్ణ రాంబాబు పర్యవేక్షణలో నవరారత్రుల పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవాలయ దర్మకర్త దూళి పాళ్ల రామగోవిందు దంపతులు పూజ కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కొత్తపాలెం, వేమవరం, చెన్నుప ల్లి, వైదన, కొణిదెన, నక్కబొక్కలపాడు,  గ్రామాలలోనూ దసరా నవ రాత్రుల వేడుకలు జరుగుతున్నాయి.

అద్దంకి: దసరా శరన్నవరాత్రులలో భాగం గా ఆదివారం శ్రీచక్ర సహిత శ్రీవాసవి కన్య కాపరమేశ్వరి దేవాలయం, దత్తపాదుకా క్షే త్రాల్లో అమ్మవారిని శ్రీసరస్వతి దేవిగా అలం కరించారు. పట్టణంలోని వేయిస్తంభాల గు డి, కమఠేశ్వరాలయం, పాత శివాలయం, పో లేరమ్మ దేవాలయాల్లో అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలలో అలంకరించారు. 

పంగులూరు: మండలంలోని పలు గ్రా మాలలో ఏడవ రోజు ఆదివారం శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘ నంగా నిర్వహించారు. పంగులూరు శ్రీభీమలింగేశ్వర స్వామి ఆలయం లో మూలవిరాట్‌ అయిన శ్రీ పార్వతీదేవి అమ్మవారిని విద్యాప్రదాయిని సరస్వతి అమ్మవారి దివ్యరూపంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గరటయ్య, మాజీ జడ్పీటీసీ బాచిన చెంచుప్రసాద్‌ , ఆర్వీ సుబ్బారావు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. సరస్వతీ మాత వద్ద ఉంచి పూజలు నిర్వహించిన పుస్తకాలు, పలకలు, పెన్నులను చిన్నారులకు అందచేశారు. కార్యక్రమంలో ఈవో కోటిరెడ్డి, జేకేసీ, అర్చకస్వాములు సునీల్‌శర్మ, పురోహితులు రామకృష్ణ శాస్ర్తి, జడ్పీటీసీ రాయిణి ప్రమీల, రామకృష్ణ, పలువురు భక్తులు పాల్గొ న్నారు. ముప్పవరంలోని శ్రీలక్ష్మీగణపతి షిరిడీ సాయి ఆలయంలో జరిగిన శరన్నవరాత్రి వేడుకలో యామిని నాగేశ్వర రావు దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.

చినగంజాం: చినగంజాంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి మందిరంలో అమ్మవారు సంతానదేవి అలంకారంలో భక్త్తులకు దర్శన మిచ్చారు. అమ్మవారి మందిరంలో బతుకమ్మ అమ్మవారికి మహిళలు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోపిరాల లలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సంతరావూరు, గొనసపూడి, కడవకుదురు, నీలాయపాలెం తదితర గ్రామాల్లో ఆలయాలలోని అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తున్నారు.

పర్చూరు: ప ర్చూరులోని అద్దంకి నాంచారమ్మ అమ్మ వారి దేవాలయం లో శ్రీసరస్వతీ దేవి గా అమ్మవారు భ క్తులకు దర్శనమి చ్చారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్ధానంలో అ మ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించారు. ఉదయం అమ్మవారి ఆలయంలో చిన్నారులచే అక్షర అభ్యాస కార్యక్రమం ఏర్పాటుచేయగా, పెద్ద సంఖ్యలో భక్తులు, చిన్నారులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.  అడుసుమల్లి గ్రామంలోని శ్రీ గంగాపార్వతీ సమేత గౌరీ శంకర ఆలయంలో  అమ్మవారిని శ్రీసరస్వతీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read more