వైసీపీ పాలనలో ప్రజలకు నరకం

ABN , First Publish Date - 2022-09-25T03:54:55+05:30 IST

వైసీపీ పాలనలో ప్రజలు నరకం చూస్తున్నారని టీడీపీ సీనియర్‌ నాయకుడు వీవీఆర్‌ మనోహరరావు (చిరంజీవి), మున్సిపల్‌ టీడీపీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు.

వైసీపీ పాలనలో ప్రజలకు నరకం
కొవ్వుత్తులతో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

కనిగిరి, సెప్టెంబరు 24: వైసీపీ పాలనలో ప్రజలు నరకం చూస్తున్నారని  టీడీపీ సీనియర్‌ నాయకుడు వీవీఆర్‌ మనోహరరావు (చిరంజీవి), మున్సిపల్‌  టీడీపీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు. పట్టణంలోని 1వ, 20వ వార్డుల్లో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర ఆదేశాలతో పెరిగిన ధరలకు నిరసనగా టీడీపీ  నాయకులు కొవ్వుత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రతి ఇంటికీ తిరుగుతూ వైసీపీ వచ్చిన ఈ మూడేళ్లలో అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. విద్యుత్‌ చార్జీలను అమాంతంగా పెంచేసి పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారాలు మోపిన జగన్‌రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.  ప్రస్తుతం నిత్యాసర సరుకులు పేదలకు అందనంత దూరంగా ఉన్నాయన్నారు. గ్యాస్‌, పెట్రోల్‌, బస్సు చార్జీలు సైతం పెంచి సామాన్యులను కష్టాలుపాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. పథకాల పేరుతో ప్రజలను వంచించిన జగన్‌రెడ్డి ధరలు పెంచి బాదుతున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ  నాయకులు ఫారూక్‌, ఫిరోజ్‌, చినరామిరెడ్డి, తెలుగు మహిళలు కరణం అరుణ తదితరులు పాల్గొన్నారు.


Read more