అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

ABN , First Publish Date - 2022-08-05T05:10:06+05:30 IST

అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుం దని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజకవర్గ ఇ న్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
పింఛన్లను అందజేస్తున్న కృష్ణచైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య

పంగులూరు, ఆగస్టు 4: అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుం దని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజకవర్గ ఇ న్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. రాష్ట్ర ప్ర భుత్వం మండలంలో నూతనంగా 280 మం దికి పింఛన్లు మంజూరుచేసింది.  గురువా రం పంగులూరు మండల పరిషత్‌ కార్యాల యంలో ఎంపీడీవో రమణమూర్తి అధ్యక్ష తన జరిగిన కార్యక్రమంలో కృష్ణచైతన్య వాటిని లబ్ధిదారులకు అందజే శారు. అంతకుముందు ఇంకొల్లు- ముప్పవరం ప్రధాన రహదారి నుంచి జాతీయ పతాకాలు చేతబూని కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడు తూ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అం దజేస్తున్నా,  ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కా ర్యక్రమంలో ఎంపీపీ తేళ్ళ నాగమ్మ, జడ్పీటీసీ రాయిణి ప్రమీల, వైఎస్‌ ఎంపీపీ ఎర్రం శ్రీనివాస రెడ్డి, సర్పంచ్‌ గుడిపూడి నాగేంద్రం, రాయిణి వెం కటసుబ్బారావు పఠాన్‌ ఖాశీంఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.


వైస్‌ ఎంపీపీ శ్రీశైలంకు పాదయాత్ర

బల్లికురవ, ఆగస్టు 4: మండలంలోని కూకట్లప ల్లికి చెందిన వైస్‌ ఎంపీ పీ ఇప్పల వెంకటసుబ్బారెడ్డి శ్రీశైలంకు తలపెట్టిన మొక్కుబడి పాద యాత్రను గురువారం కృష్ణచైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న పలు దేవాలయాలలో జరిగిన పూజా కార్యక్రమా ల లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌చైర్మన్‌ చింతల పేరయ్య, జడ్పీటీసీ చింతల అంజలిశ్రీనివాసరావు, సర్పంచ్‌ ఇప్పల అయప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:10:06+05:30 IST