ప్రజల ముంగిటకు ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-06-26T05:37:26+05:30 IST

సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకు తీసుకు వచ్చే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చిందని శాప్‌ నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బా చిన కృష్ణచైతన్య అన్నారు.

ప్రజల ముంగిటకు ప్రభుత్వం
సంక్షేమ పఽథకాల గురించి వివరిస్తున్న కృష్ణచైతన్య

 శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య

అద్దంకి, జూన్‌ 25: సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకు తీసుకు వచ్చే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రజల  వద్దకు పాలన తీసుకువచ్చిందని శాప్‌ నెట్‌ చైర్మన్‌, వైసీపీ  అద్దంకి నియోజకవర్గ  ఇన్‌చార్జి బా చిన కృష్ణచైతన్య అన్నారు. గడప గడపకు మన ప్రభు త్వం కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని 20వ వార్డులో కృష్ణచైతన్య ఇంటింటికి తిరిగి ఆయా లబ్ధిదారులకు  అందుతున్న పథకాల గురించి వివరించా రు. వలంటీర్‌, సచివాలయ వ్యవస్థలు ప్రవేశపెట్టి పాలనను ప్రజలకు చేరువ చేశారన్నారు.  కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వైస్‌చైర్మన్‌లు దేసు పద్మేష్‌, అనంతలక్ష్మి, 20వ వార్డు కౌన్సిలర్‌ గుంజి కోటేశ్వరరావు, వైసీపీ పట్టణ  అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


అర్హులందరికీ ‘సంక్షేమం’

కారంచేడు(పర్చూరు), జూన్‌ 25: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు వైసీపీ నియోజకరవర్గ ఇన్‌చార్జి రావి రామనాథంబాబు అన్నారు. కారంచేడులో శనివారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించ టమే లక్ష్యంగా వైసీపీ ప్రభు త్వం పనిచేస్తుందన్నారు. కా ర్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ దండా చౌదరి, ఎంపీపీ నీరు కట్టు వాసు బాబు, వైస్‌ ఎంపీపీ యా ర్లగడ్డ సుబ్బా రావు తది తరులు పా ల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T05:37:26+05:30 IST