గోళ్ల మృతికి ఉగ్ర సంతాపం

ABN , First Publish Date - 2022-09-25T04:01:49+05:30 IST

మండలంలోని కంభా లదిన్నె గ్రామానికి చెందిన కనిగిరి సమితి మాజీ అధ్య క్షుడు గోళ్ల తిరుపతినాయుడు సోదరుడు గోళ్ల కొండప నాయుడు (70) శనివారం రాత్రి ఇంటివద్దనే గుండె పోటుతో మృతి చెందారు.

గోళ్ల మృతికి ఉగ్ర సంతాపం
నివాళి అర్పిస్తున్న ఉగ్ర, నాయకులు

పామూరు, సెప్టెంబరు 24 : మండలంలోని కంభా లదిన్నె గ్రామానికి చెందిన కనిగిరి సమితి మాజీ అధ్య క్షుడు గోళ్ల తిరుపతినాయుడు సోదరుడు గోళ్ల కొండప నాయుడు (70) శనివారం రాత్రి ఇంటివద్దనే గుండె పోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కు మారులు, కుమార్తె ఉన్నారు. కొండపనాయుడు మృతి చెందారని తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ  ఇన్‌ చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ మండలా ధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు,  జడ్పీటీసీ మాజీ సభ్యుడు బొల్లా మాల్యాద్రిచౌదరితో కలిసి కొండప నాయుడు మృత దేహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సం తాపం తెలిపినవారిలో ప్రభాకర్‌ చౌదరి, సయ్యద్‌ అమీర్‌బాబు, తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీ బొల్లా నరసింహారావు, మాల్యాద్రి, ఏలూరి నరసింహా రావు, రమణయ్య, రమేష్‌, బంధు వులు ఉన్నారు. 

Read more