బాలిక కిడ్నాప్‌.. అత్యాచార యత్నం

ABN , First Publish Date - 2022-03-05T06:10:17+05:30 IST

బాలికను కిడ్నాప్‌ చేసి బలవంతంగా మద్యం తాపించి అత్యాచారయత్నం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాలిక కిడ్నాప్‌.. అత్యాచార యత్నం

పోలీసుల అదుపులో నిందితుడు

ఒంగోలు(క్రైం), మార్చి 4 : బాలికను కిడ్నాప్‌ చేసి బలవంతంగా మద్యం తాపించి అత్యాచారయత్నం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 1 సాయంత్రం నగరంలోని రాజీవ్‌నగర్‌లో నివాసం ఉండే బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చింది. స్థానిక గాంధీపార్కు వద్దకు చేరుకుంది. అదేసమయంలో తన స్నేహితుడి సోదరుడు బాబ్జీ అక్కడికి వచ్చాడు. తనతో కొత్తపట్నం రావాలని బలవంతంగా మోటారు సైకిల్‌పై ఎక్కించుకెళ్లాడు. అక్కడ కాటేజీలో గది అద్దెకు తీసుకొని అమ్మాయికి బలవంతంగా మద్యం తాపించాడు. అనంతరం అత్యాచార యత్నం చేశాడు. దీంతో తేరుకున్న యువతి అతనిని అడ్డుకుంది. గొడవ చేస్తానని బెదిరించడంతో బాబ్జీ బాలికను తీసుకొని రాత్రి సమయంలోనే ఒంగోలు వచ్చాడు. స్థానిక సెంట్రల్‌ కేఫ్‌ వద్ద టిఫిన్‌ తీసుకునేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఆ బాలిక తన స్నేహితుడు నివాసముండే అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లి అక్కడ అతని కోసం వాకబు చేసింది. ఆ ససమయంలో అతడు లేడు. స్నేహితుని సోదరుడు ఉన్నాడు. అప్పటికే మత్తులో ఉన్న బాలిక అక్కడే పడిపోయింది. దీంతో ఆమెను తీసుకెళ్లి ఇంట్లో పడుకోబెట్టి పోలీసులకు ఫోన్‌ చేశాడు. ఈ మేరకు వన్‌టౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని బాలికను రిమ్స్‌కు తరలిం చారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  నిందితుడు బాబ్జీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.  


Updated Date - 2022-03-05T06:10:17+05:30 IST