మార్కాపురం జిల్లా కోసం ఉద్యమం ఉధృతం
ABN , First Publish Date - 2022-02-07T05:21:50+05:30 IST
మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని చేపట్టిన ఉద్యమం ఉధృతం కానుంది. అందుకు సంబంధించిన కార్యాచరణను జేఏసీ రూపొందింది. అందులో భాగంగా ఈనెల 9 నుంచి రిలేదీక్షలు ప్రారంభంకానున్నాయి. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జిల్లా సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో గతనెల 29న రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
9 నుంచి రిలే నిరాహార దీక్షలు
15 నుంచి పాదయాత్రకు కార్యాచరణ
మార్కాపురం, ఫిబ్రవరి 6 : మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని చేపట్టిన ఉద్యమం ఉధృతం కానుంది. అందుకు సంబంధించిన కార్యాచరణను జేఏసీ రూపొందింది. అందులో భాగంగా ఈనెల 9 నుంచి రిలేదీక్షలు ప్రారంభంకానున్నాయి. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జిల్లా సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో గతనెల 29న రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులతో ప్రదర్శన, శనివారం కాగడాల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
దీక్షలకు ప్రజలు పెద్దఎత్తున వచ్చేలా చర్యలు
ఆర్డీవో కార్యాలయం ఎదుట మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలను ఈనెల 9 నుంచి ప్రారంభించనున్నారు. అందులో పాల్గొనేందుకు మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నుంచి పెద్దఎత్తున పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటి ఏర్పాట్లను ఆదివారం జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్, సీపీఐ నాయకులు అందె నాసరయ్య పర్యవేక్షించారు.
పాదయాత్రకూ సన్నద్ధం
మార్కాపురంను జిల్లాగా ఏర్పాటు చేయాలని మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజవర్గాలలో ఈనెల 15నుంచి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్రలు ప్రారంభంకానున్నాయి. అందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల బాధ్యులు రూట్ మ్యాప్‌లు తయారు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఒకేరోజు పాదయాత్రలు ప్రారంభించి అందరూ ఒకే రోజు మార్కాపురం చేరుకొని భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.