రుణాలు మంజూరుపై దృష్టిసారించాలి

ABN , First Publish Date - 2022-09-29T04:16:03+05:30 IST

ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణాలను లబ్ధిదారులకు అందజేసే విధంగా బ్యాంకర్లు ప్రత్యేక దృష్టిసారించాలని డీఆర్‌డీఎ పీడీ బి.అర్జునరావు అన్నారు. పర్చూరులోని ఎంపీడీవో కార్యాలయం సమావేశభవనంలో బుధవారం బ్యాంకర్లు, వెలుగు సిబ్బందికి రుణాల మంజూరుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడీ మాట్లాడుతూ రుణాలను అందజేయటంతోపాటు, రికవరీని కూడా సమర్ధవంతంగా వసూలు చేయాలన్నారు

రుణాలు మంజూరుపై దృష్టిసారించాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌డీఎ పీడీ అర్జునరావు

డీఆర్‌డీఏ పీడీ అర్జునరావు

పర్చూరు, సెప్టెంబరు 28: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణాలను లబ్ధిదారులకు అందజేసే విధంగా బ్యాంకర్లు ప్రత్యేక దృష్టిసారించాలని డీఆర్‌డీఎ పీడీ బి.అర్జునరావు అన్నారు. పర్చూరులోని ఎంపీడీవో కార్యాలయం సమావేశభవనంలో బుధవారం బ్యాంకర్లు, వెలుగు సిబ్బందికి రుణాల మంజూరుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడీ మాట్లాడుతూ రుణాలను అందజేయటంతోపాటు, రికవరీని కూడా సమర్ధవంతంగా వసూలు చేయాలన్నారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడుతూ కరోనాను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఖాతాదారుడికి సామాజిక భద్రత కల్పించే విధంగా వ్యక్తిగత బీమా సౌకర్యం కల్పించే విధంగా సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలు, రైతులకు అందజేస్తున్న వ్యవసాయ రుణాలపై రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, డీపీఎం లక్ష్మణ్‌చారి, మేనేజర్‌లు గేరా అశోక్‌ బాబు, ప్రదీప్‌ కుమార్‌, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Read more