అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ నిరాహారదీక్ష
ABN , First Publish Date - 2022-08-05T05:14:21+05:30 IST
అ క్రమంగా కేసులు బనాయించి ఓ ఎస్సై వే ధింపులకు గురిచేస్తున్నాడని కనిగిరికి చెం దిన వినుకొండ సుబ్బయ్య తన కుమా రునితో కలిసి స్థానిక ప్రకాశంభవన్ వద్ద నిరాహర దీక్షకు దిగారు.
ఒంగోలు(క్రైం), ఆగస్టు 4: అ క్రమంగా కేసులు బనాయించి ఓ ఎస్సై వే ధింపులకు గురిచేస్తున్నాడని కనిగిరికి చెం దిన వినుకొండ సుబ్బయ్య తన కుమా రునితో కలిసి స్థానిక ప్రకాశంభవన్ వద్ద నిరాహర దీక్షకు దిగారు. పోలీసులు సివి ల్ వివాదాలలో తల దూర్చి వేధింపులకు గురిచేయడమే కాకుండా తన భార్యపై అ క్రమ కేసు బనాయించి జైలుకు పంపిచా రని సుబ్బయ్య వాపోయాడు. సామిల్లు విషయంలో కనిగిరి ఎస్సై రామిరెడ్డి తలదూర్చి యజమానికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటుగా తనను బెదిరింపులకు గురిచేశాడని, ఆయన వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య య త్నం చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్పీ స్పందన కార్యక్రమంలో ఎనిమి ది మార్లు విన్నవించానని అయినా తనకు న్యాయం చేయలేదన్నారు. ఈక్ర మంలో చేసేదేమి లేక తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రకాశంభవన్ వ ద్ద నిరహరదీక్షకు పూనుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.