రైతుల ఆశలు ఆవిరి
ABN , First Publish Date - 2022-12-15T23:49:23+05:30 IST
మాండస్ తుఫాన్ రై తుల ఆశలను ఆవిరి చేసింది. భారీ వర్షాలు నిండా ముంచాయి. అధిక వర్షాలకు పంగులూరు మండలం లో పొగాకు, మిరప తోటలకు ఎక్కువ నష్టం వాటిల్లే పరిస్థితి నెలకుంది.
అధిక వర్షానికి వడబడుతున్న మిరప, పొగాకు
నీరునిలిచిన ప్రదేశంలో దెబ్బతిన్న శనగ
ఈక్రాప్ చేపట్టిన అధికారులు
పంగులూరు, డిసెంబరు 15: మాండస్ తుఫాన్ రై తుల ఆశలను ఆవిరి చేసింది. భారీ వర్షాలు నిండా ముంచాయి. అధిక వర్షాలకు పంగులూరు మండలం లో పొగాకు, మిరప తోటలకు ఎక్కువ నష్టం వాటిల్లే పరిస్థితి నెలకుంది. పలు గ్రామాలలో సాగులో ఉన్న పొగతోటలలో ఎక్కువ శాతం మొక్కలు వడబడి కని పిస్తున్నాయి. పలుచోట్ల మిరప తోటల్లో సహితం మొ క్కలు వడబడి కనిపిస్తున్నాయి. సుమారు 600 ఎకరా లలో పొగాకు పంటకు నష్టం ఉంటుందని అధికారు లు ప్రాఽథమిక అంచనా వేశారు. అలాగే, మూడువేల ఎకరాలకు పైగా మిరపకు నష్టం వాటిల్లవచ్చని ప్రాథ మిక అంచనా వేసి నట్లు ఉద్యాన అధికారి దీప్తి తెలి పారు. రబీలో సాగుచేసిన పంటల వివరాలకోసం ముందుగా గ్రామాలలో ఈ క్రాప్ చేపట్టామని చెప్పారు. శుక్రవారం నుం చి పంట నష్టంపై పూర్తి అంచనా కోసం ఎ న్యూమరేషన్ చేపడుతున్నట్టు దీప్తి తెలి పారు.
శనగకు సంబంధించి 2,900 ఎకరాలలో పంట న ష్టం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామని, ఆమేరకు పంట నష్టం ఉండక పోవచ్చని ఏవో సుబ్బా రెడ్డి తెలిపా రు. సాగులో ఉన్న పంట పొలంలో నీరు నిలిచినచోట శనగ పంటకు పూర్తి నష్టం ఉంటుందని తెలిపారు. శనగ పైరును కాపాడుకునేందుకు లీటర్ నీటికి నా లుగు గ్రాముల యూరియా పిచికారి చేయడం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. నానో యూ రియా వినియోగం ప్రయోజనకరంగా ఉంటుం దన్నారు. సాగర్ జలాల విడుదల పంట పొలాలకు ఇబ్బందికరంగా ఉందని పం గులూరు, కొప్పెరపాడు రైతులు త మ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. కో త దశలో ఉన్న మినుముతో పాటు శనగకు వాటిల్లిన నష్టాన్ని అంచనావేసి అధికారులకు నివేదిక ఇస్తామన్నారు.
సాగర్ కాలువ కట్టలపై పొంగిప్రవహిస్తున్న నీరు
పంగులూరు, డిసెం బరు 15: రైతులకు గోరు చుట్టుపై రోకటి పోటు లా సాగర్ జలాలు కాలువలు కట్టలపై పొంగి ప్రవహించి పంట చేలును ముంచుతు న్నాయి. పంగులూరు గ్రామానికి ఉత్తరం వైపుగా ఉ న్న కోటపాడు మైనర్ కాలువకు అధికంగా చేరుతున్న సాగర్ జలాలు కట్టలపై పొంగి పొర్లడంతో పొలాలు ముంపునకు గురవుతున్నా యి. స్థానిక ఎన్‌ఎస్పీ అధి కారులకు తెలియపరచినా తామేమి చేయలేమనే స మాధానంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతు న్నారు. పంటలకు నీటి అవసరం లేకున్నా, దిగువకు అధి క నీటిని విడుదల చేయడంతో కాలువ చివరి ప్రాంత రైతులు పంటలను కాపాడుకోలేక ఇబ్బందులు పడు తున్నారు. ఎన్‌ఎస్పీ ఉన్నతాధికారులు రైతాంగం ఎదు ర్కొంటున్న సమస్యను గుర్తించి సాగర్ నీటి విడుదల ను వెంటనే నిలుపు చేయాలని దిగువ ప్రాంత రైతు లు వేడుకుంటున్నారు.
వైట్ బర్లీకి నష్టం అపారం
పర్చూరు, డిసెంబరు 15: భారీ వర్షాలు వైట్ బర్లీ రైతులకు అపార నష్టం చేకూర్చాయి. ఏడతెరిపి లేకుం డా కురిసిన భారీ వర్షాలకు పైర్లు పూర్తిగా దెబ్బతిని ఉరకెత్తాయి. మొక్కలు వడబారి ఎండుముఖం పట్ట డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది వైట్‌బర్లీ పొగాకు ధర అఽశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు చేపట్టారు. మిర్చికి న ల్లనల్లి, తామర పురుగు నేపథ్యంలో రైతులు ఈఏడాది వైట్‌బర్లీ పొగాకు సాగుకు ఆసక్తి చూపారు. పర్చూరు వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని పర్చూరు, ఇంకొ ల్లు, యద్దనపూ డి, కారంచే డు మండలా ల్లో ఇప్పటికే 15వేల ఎకరాలకు పైగా రైతులు వైట్ బర్లీ పొగాకును సాగుచేస్తున్నారు. పైర్లు జీవం పోసుకుని కళకళ లా డుతున్న తరుణంలో మాండస్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు వైట్‌బర్లీ రైతులను నష్టాల ఊ బిలోకి నెట్టాయి. ఇప్పటికే ఎకరానికి కౌలు, మొక్కలు, వ్యవసాయ ఖర్చులు కలుపుకుని రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు పెట్టినట్టు రైతులు పేర్కొ న్నారు.
పంట నష్టం అంచనాలను తయారుచేయాలి
మేదరమెట్ల, డిసెంబరు 15: అధిక వర్షాలతో నష్ట పోయిన పంటల అంచనాలను తయారుచేసి పంపిం చాలని ఆర్‌డీవో సరోజిని అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని దైవాలరావూరు, బొల్లవర ప్పాడు గ్రామాలలో అధిక వర్షాలకు నష్టపోయిన శనగ, పొగాకు పంటలను అఽధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగాకకు సంబంధించి పంట నష్టం అంచనాలను పొగాకు బో ర్డు అధికారులకు పంపిస్తామన్నారు. శనగ, మినుము తదితర పంటల నష్ట్టానికి చెందిన వివరాలను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ సాదినేని ప్రసన్నకుమారి, తహసీల్దార్ లక్ష్మీనారా యణ, వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, వీఏవో అలే ఖ్య, రైతు బాచిన సుబ్బారావు, సొసైటీ అఽధ్యక్షుడు గుం డపనేని ఆనందబాబు, అధికారులు పాల్గొన్నారు.