క్షణికావేశ నిర్ణయాలతో కుటుంబాలు చిన్నాభిన్నం

ABN , First Publish Date - 2022-11-04T23:49:47+05:30 IST

క్షణికావేశ నిర్ణయాలతో కుటుం బాలు ఛిన్నాభిన్నం అవుతాయని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. శుక్రవారం చీరాల పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు.

క్షణికావేశ నిర్ణయాలతో కుటుంబాలు చిన్నాభిన్నం

ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్‌ ప్రారంభం

చీరాలటౌన్‌, నవంబరు 4: క్షణికావేశ నిర్ణయాలతో కుటుం బాలు ఛిన్నాభిన్నం అవుతాయని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. శుక్రవారం చీరాల పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల అఽధికశాతం మంది తీసుకుంటున్న క్షణికావేశ నిర్ణయాలతో కుటుంబాలను రోడ్డున పడుతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్రమంలో ఏర్పాటుచేసిన కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. ఈసెంటర్‌లో నిష్ణాతులైన ఇద్దరు న్యాయ సలహాదారులు, చట్టాలపై అవగాహన కలిగిన మాజీ పోలీస్‌ అధికారి, ఆరోగ్య సమస్యలతో తలెత్తిన వివాదాల పరిష్కారం కోసం వైద్యాధికారులు ఉంటారని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చేవారి సమస్యల పరిష్కారం వేగవంతంగా చేయాలని ఈసందర్భం గా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ శ్రీకాంత్‌, డీసీఆర్‌బీ డీఎస్పీ జి.లక్ష్మయ్య, బాపట్ల స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, టూటౌన్‌ సీఐ సోమశేఖర్‌, కౌన్సెలింగ్‌ కమిటీ సభ్యులు సుభాషిణి, న్యాయవాది దేవ కరుణకుమారి, నల్లూరి బ్రహ్మం, చీరాల సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేయాలి

ఈనెల 12 జరగ నున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేయాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. శుక్ర వారం పట్టణంలోని ము నిసిపల్‌ కార్యాలయంలో చీరాల సబ్‌ డివిజన్‌ ప రిధిలోని పోలీస్‌ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వృత్తి నైపుణ్యాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దర్యాప్తు సాగించి వేగవంతంగా చార్జ్‌షీట్‌ వేయాలని సూచించారు. సముద్రతీరంలో జరుగుతున్న ప్రమాదాలపై ఆరా తీశారు. ప్రమాద స్థలాల్లో హెచ్చరికలు ఏర్పాటుచేయాలన్నారు.

కార్తీకమాసాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి 50 మీటర్లను ఒక సెక్టార్‌గా పరిగణించాలని సూచిం చారు. ఎప్పటికప్పుడు ప్రమాదాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చే యాలన్నారు. కార్యక్రమంలో చీరాల సబ్‌డివిజన్‌ పరిధిలోని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2022-11-04T23:49:54+05:30 IST