లోకేష్‌పై తప్పుడు ప్రచారం మానుకోవాలి

ABN , First Publish Date - 2022-08-05T04:58:36+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌పై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్‌లు, అబద్ధపు ప్రచారంపై తె లుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేష్‌పై తప్పుడు ప్రచారం మానుకోవాలి

పోలీస్‌ స్టేషన్‌లో తెలుగు మహిళల ఫిర్యాదు

కనిగిరి, ఆగస్టు 4 : టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌పై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్‌లు, అబద్ధపు ప్రచారంపై తె లుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం పో లీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లోకేష్‌పై అభ్యంతరకర పోస్టింగులు పె ట్టిన గుర్రపాటి దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహి ళ లు డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ కుటుంబం కమశిక్షణకు, నీతినిజాయితీకి మారుపేరన్నారు. అలాంటి కుటుంబం, వ్యక్తులపై బురద జల్లాలని చూ స్తే ప్రజలు సహించబోరన్నారు. వెంటనే ఆ పోస్టింగ్‌లు తొలగించి,  కారకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళానాయకులు కరణం అరుణ, మాజీ కౌన్సిలర్‌ షేక్‌ వాజిదాబేగం, దోశపాటి కుమారి, రమ ణమ్మ, రమాదేవి, కవిత, ప ద్మావతి, పర్వీన్‌, నాగమణి, రమణ, మస్తాన్‌బి, ఈశ్వరమ్మ, సుబ్బమ్మ  పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-05T04:58:36+05:30 IST