టీడీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-11-24T22:52:56+05:30 IST

తెలుగుదేశం పార్టీ విజయానికి గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మన బోయిన వెంగయ్య తెలిపారు.

టీడీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

సీఎస్‌పురం, నవంబరు 24 : తెలుగుదేశం పార్టీ విజయానికి గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మన బోయిన వెంగయ్య తెలిపారు. టీడీపీ కార్యాల యంలో క్లస్టర్‌ ఇన్‌చార్జిల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గ్రామాలలో ఓట్లు లేనివారిని గుర్తించి వారు ఓట్లు నమోదు చేసుకునేలా చర్యలు చేప ట్టాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధికారంలోనికి వచ్చేలా అధికార పార్టీ చేపట్టే ప్రజా వ్యతిరేక కార్య క్రమాలను ప్రజల్లోనికి తీసుకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకులకు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు పొందిన వారిని సన్మానిం చారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్లా, సీఎస్‌పురం ఉపసర్పంచ్‌ పాములపాటి న ర్సయ్య, మాజీ సర్పంచ్‌లు ఎన్‌.సీ.మాలకొండయ్య, పును గుపాటి రవికుమార్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి మ ల్లికార్జున, టీఎన్‌టీయుసీ రాష్ట్ర కార్యదర్శి దేవెండ్ల తిరు పతయ్య, ఒంగోలు పార్లమెంట్‌ తెలుగు యువత కార్యదర్శి షేక్‌ రజ్జబ్‌బాషా, సీనియర్‌ నాయకులు ఎ.రామ కృష్ణంరజు, స్టేట్‌ మైనార్టీ సెల్‌ కార్యదర్శి పఠాన్‌ నాయబ్‌ రసూల్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యులు హాజీ మలాన్‌, మండల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మాబాషా, గ్రామ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T22:53:29+05:30 IST

Read more