అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు

ABN , First Publish Date - 2022-01-23T04:34:34+05:30 IST

రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలవారికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు
జాబ్‌మేళా సభలో మాట్లాడతున్న మంత్రి సురేష్‌

మంత్రి సురేష్‌

ఎర్రగొండపాలెం, జనవరి 22 : రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలవారికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఎర్రగొండపాలెంలో రూ.1.30 కోట్ల నిధులతో నిర్మించిన అంబేడ్కర్‌, జగ్జీవన్‌రాం ఆడిటోరియం భవనాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సురేష్‌ మాట్లాడుతూ  అంబేడ్కర్‌ ఆశయ సాధన దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.  పశ్చిమంలో ఎర్రగొండపాలెం  వెనుకబడిన ఏరియా అని,  ఇక్కడ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా  తాగు, సాగునీరు అందినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు.    

జాబ్‌మేళాతో ఉపాధి అవకాశాలు

నియోజకవర్గంలో పేదరికం, నిరుద్యోగంతో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేశామని మంత్రి సురేష్‌ అన్నారు. 30 కంపెనీల ప్రతినిధులు వచ్చారని, యువతీయువకులు మీ ప్రతిభను కనబరిచి ఉద్యోగాలు పొందాలన్నారు. దాదాపు అందరికీ అవకాశాలు వస్తాయని ప్రైవేటు ఉద్యోగంలైనా చేరి మంచిగా స్థిరపడాలని కోరారు.  అనంతరం రూ.40 లక్షలతో నిర్మించిన 4వ సచివాలయ భవనాన్ని మంత్రి  ప్రారంభించారు.  తర్వాత అయ్యప్పనగర్‌లో, పడమరవీధిలో రూ.72 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో డీటీడబ్ల్యూ లక్ష్మానాయక్‌ అధ్యక్షత వహించారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌  ఎం.విక్టర్‌ ప్రసాద్‌,  జిల్లా ఆసరా జేసీ కృష్ణవేణి, ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, ఏఎంసీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.కనకారావు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ అమ్మాజీ, రెల్లి కార్పొరేషన్‌ చైర్మన్‌ మదుబాబు, ఎంపీపీ డి కిరణ్‌గౌడ్‌, జడ్పీటీసీ సభ్యుడు చేదూరి విజయభాస్కర్‌, తహసీల్దార్‌ వి.వీరయ్య, పీడీసీసీ  డైరెక్టర్‌ బాలగురవయ్య, ఉప్పర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రామారావు, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు ఎస్‌ షాకీర్‌బాషా, మండల కోఆప్షన్‌ విజయ్‌కుమార్‌, సర్పంచ్‌ ఆర్‌.అరుణాబాయ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-23T04:34:34+05:30 IST