దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ

ABN , First Publish Date - 2022-10-17T05:59:43+05:30 IST

మండలంలోని దర్గా గ్రామపంచాయతీలో పలు దేవాలయాలు, కల్యాణ మండపం నిర్మించిన దర్గా కొండపై సర్వే నెంబరు 78లో విలువైన ప్రభుత్వ భూములను కొందరు అక్రమార్కులు దర్జాగా ఆక్రమించుకున్నారు.

దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ
ఆక్రమిత భూమిలో జరుగుతున్న నిర్మాణాలు

కంభం, అక్టోబరు 16 : మండలంలోని దర్గా గ్రామపంచాయతీలో పలు దేవాలయాలు, కల్యాణ మండపం నిర్మించిన దర్గా కొండపై సర్వే నెంబరు 78లో విలువైన ప్రభుత్వ భూములను కొందరు అక్రమార్కులు దర్జాగా ఆక్రమించుకున్నారు. రెవెన్యూ అధికారుల వద్ద పట్టాలు పుట్టించడం, లక్షలకు అమ్ముకొని, అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నా, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై ప్రజలు అధికారుల దృష్టికెళ్లారు. దీంతో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అక్రమార్కులు హెచ్చరిక బోర్డులను తొలగించి దర్జాగా ఆస్థలాలను చదును చేసి రెవెన్యూ అధికారుల చేతుల తడిపి కట్టడాలు నిర్మిస్తున్నారు. దీనిపై స్పందించిన గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు, ఇతర అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభు త్వ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. లేనిపక్షంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2022-10-17T05:59:43+05:30 IST