ఉపాధి కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించాలి
ABN , First Publish Date - 2022-05-19T05:01:54+05:30 IST
జిల్లాలో ఉపాదికూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ్కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సంతమాగులూరు మండలం చవిటిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి పల్లె కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఆ గ్రామంలోనే నిద్రించారు. బుధవారం ఉదయం గ్రామంలోని వీధులలో తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పఽథకాలు గురించి ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ విజయ్కృష్ణన్
సంతమాగులూరు, మే 18: జిల్లాలో ఉపాదికూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ్కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సంతమాగులూరు మండలం చవిటిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి పల్లె కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఆ గ్రామంలోనే నిద్రించారు. బుధవారం ఉదయం గ్రామంలోని వీధులలో తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పఽథకాలు గురించి ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు, చీరాల ఆర్డీవో పి. సరోజిని, డీపీవో శంకరరావు, జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి ప్రసాద్, డీఆర్డీఏ పీడీ సత్యసాయి, డ్వామా పీడీ ఉషారాణి, తహసీల్దార్ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.