బడుగుల జీవితంపై విద్యుత్‌ పిడుగు!

ABN , First Publish Date - 2022-08-05T05:15:18+05:30 IST

విద్యుత్‌ బిల్లులు బడుగులను భయపెట్టిస్తున్నాయి. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉప ప్ర ణాళిక ద్వారా ఉచిత విద్యుత్‌ ఇస్తామని ఇస్తున్న హామీలు నీటి మూటలుగా మారాయి.

బడుగుల జీవితంపై విద్యుత్‌ పిడుగు!



అధిక బిల్లుల మోత 

లబోదిబో అంటున్న ఎస్సీ కాలనీవాసులు


మర్రిపూడి, ఆగస్టు 4 : విద్యుత్‌ బిల్లులు బడుగులను భయపెట్టిస్తున్నాయి. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉప ప్ర ణాళిక ద్వారా ఉచిత విద్యుత్‌ ఇస్తామని ఇస్తున్న హామీలు నీటి మూటలుగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయని వాటిని చెల్లించాలంటు ప్రస్తుతం అధికారులు బిల్లులు ఇస్తుండటంతో బ డుగు జీవుల గుండెలు గుబేల్‌ అంటున్నాయి. రెక్కాడితేకా ని డొక్కాడని బతుకులు విద్యుత్‌ బిల్లులు చూసి షాక్‌కు గురవుతున్నారు.  మండలంలోని కూచిపూడి ఎస్సీ కాలనీ లో గత నెలలో వచ్చిన కరెంట్‌ బిల్లులను చూసి కాలనీవాసులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. కాలనీలోని 10 గృహాలకు పైగా అధిక బిల్లులు వచ్చినట్లు తెలిసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 100 యూనిట్లు వరకు ఉ చిత విద్యుత్‌ అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 200 యూనిట్లు వరకు ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద ఉచితంగా విద్యుత్‌ అందిస్తామని ప్రకటించింది. ఆ మేరకు జూలై నెలలో వచ్చిన బి ల్లులు డబ్బులు చెల్లించకుండానే ఉచిత విద్యుత్‌ యూనిట్లకు లోబడి ఉన్నాయి. అయితే బిల్లులోని కింద భాగంలో గత బకాయిలు కింద రూ.వేలాది చెల్లించాలంటు బిల్లులో పొందుపర్చారు. బిల్లులు చూడగానే ఒక్కసారిగా వినియోగదారులు హతాసులయ్యారు. నాలుగు రోజుల క్రితం బా దుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్థా నిక శాసనసభ్యులు స్వామి ఎదుట పెద్ద ఎత్తున కాలనీవాసులు కరెంటు బిల్లులను చూపించి తమ ఆందోళనను వ్యక్తపరిచారు. కాలనీకి చెందిన సర్వీస్‌ నెంబర్‌ 1021 గ డ్డం సుబ్బులు పేరుతో ఉంది. పాత బకాయిలు కింద రూ.24,455 చెల్లించాలంటు విద్యుత్‌ బిల్లు జారీ చేశారు. కూలీనాలీ చేసుకుని పొట్టగడుపుకునే తమకు ఇంత బకాయిలు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదని ఆమె వాపోయారు. అదే కాలనీకి చెందిన మైదుకూరి నరసింహంకు రూ.19,676 చెల్లించాలని అధికారులు బిల్లులు అం దించారు. రూ.10,000పైగా బిల్లులు వచ్చిన గృహాలు కాలనీలో 10 కి పైగానే ఉన్నాయి. ఈ విషయంపై ఎమ్మెల్యే స్వామి సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. విద్యుత్‌ ధరలు పెంచి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను సహితం బాదుడే బాదుడుతో ఇబ్బం ది పెడుతుందని ఆ యన ఆరోపించా రు. అధిక బిల్లులు రావడంపై విద్యుత్‌ శాఖ ఏఈ రామకృష్ణారెడ్డిని వివరణ కోరగా ప్రభుత్వం ఉ చితంగా అందచేసే యూనిట్ల కన్నా ఒక్క యూనిట్‌ ఎక్కువగా వాడినప్పటికి ఆమొత్తం యూనిట్లకు బిల్లు చెల్లించాల్సిందేనని చెప్పారు. ప్రభుత్వం నిర్ధేశించిన యూనిట్లకు లోబడే విద్యుత్‌ వాడకం ఉండాలని ఆయన వినియోగదారులకు సూచించారు. ఇప్పటికైనా విద్యుత్‌ అధికారులు ని రుపేదలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ బిల్లులు తగ్గించాలని కాలనీవాసలు వేడుకుంటున్నారు.


Updated Date - 2022-08-05T05:15:18+05:30 IST