గడప గడపకూ తాయిలాలు!

ABN , First Publish Date - 2022-12-07T01:34:36+05:30 IST

గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా క్యాలెండర్లు, దేవుళ్ల బొమ్మల పంపిణీ చర్చనీయాంశమైంది. ఒంగోలులోని 25వ డివిజన్‌లో జరుగుతున్న కార్యక్రమంలోనే పంపిణీ చేయడంపై నగర వ్యాప్తంగా ఎన్నికలకు ముందే తాయిలాలు అంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

గడప గడపకూ తాయిలాలు!

ఎమ్మెల్యే వెనుకే క్యాలెండర్లు, బొమ్మల పంపిణీపై చర్చ

ఒంగోలు (కలెక్టరేట్‌), డిసెంబరు 6 : గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా క్యాలెండర్లు, దేవుళ్ల బొమ్మల పంపిణీ చర్చనీయాంశమైంది. ఒంగోలులోని 25వ డివిజన్‌లో జరుగుతున్న కార్యక్రమంలోనే పంపిణీ చేయడంపై నగర వ్యాప్తంగా ఎన్నికలకు ముందే తాయిలాలు అంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 25వ డివిజన్‌ కార్పొరేటర్‌, డిప్యూటీ మేయర్‌ వేమూరి సూర్యనారాయణ ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్‌లో మతాల వారీగా క్యాలెండర్లు, దేవుళ్ల బొమ్మలను పంచుతున్నారు. రెండు నెలల నుంచి ఒంగోలు నగరంలో గడప గడపకు కార్యక్రమం జరుగుతున్నా ఏ డివిజన్‌లో లేని విధంగా ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమంలో వెండి ప్రతిమలు ఇంటింటికి తిరిగి ఇస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను చల్లార్చేందుకు వీటిని పంపిణీ చేస్తున్నారన్న చర్చ విస్తృతంగా నడుస్తోంది.

Updated Date - 2022-12-07T01:34:38+05:30 IST