యలమందారెడ్డికి అంతిమ వీడ్కోలు

ABN , First Publish Date - 2022-12-12T22:19:11+05:30 IST

దర్శి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌, మాజీ స ర్పంచ్‌, సొసైటీ అధ్యక్షుడు పలగాని యలమందారెడ్డి అనారోగ్యంతో మృతి చెంద డం దురదృష్టకరమని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.

యలమందారెడ్డికి అంతిమ వీడ్కోలు
యలమందారెడ్డి మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి 8 యలమందారెడ్డికి నివాళి

ముండ్లమూరు, డిసెంబరు 12 : దర్శి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌, మాజీ స ర్పంచ్‌, సొసైటీ అధ్యక్షుడు పలగాని యలమందారెడ్డి అనారోగ్యంతో మృతి చెంద డం దురదృష్టకరమని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. సోమవారం మా రెళ్ల వచ్చి యలమందారెడ్డి పార్దివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంత రం కుటుంబ సభ్యులను పరామర్శించారు. యలమందారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఆయన మృతి వైసీపీకి, వ్యక్తిగతంగా తమ కుటుంబానికి తీవ్ర నష్టమన్నారు. ఎక్కడ కలసినా ఎంతో అప్యాయంగా పలుకరించే వారన్నారు. అ లాంటి వ్యక్తి చనిపోవటం బాధాకరమైన విషయం అన్నారు. ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, కుంచాల నాగరాజు, సరస్వతి విద్యా సంస్థల అధినేత ఏవీ రమ ణారెడ్డితో పాటు ఒగులూరి శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. అనంతరం దర్శి ఎమ్మె ల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సోదరుడు రవీంద్ర యలమందారెడ్డి మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. యలమందారెడ్డితో పరిచయం ఉన్న టీడీపీ, వైసీపీ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్‌ అ న్నపురెడ్డి భిక్షాలరెడ్డి, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, సుంకర రాఘవరెడ్డి, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వాకా జనార్దనరెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, వాకా సుబ్బారెడ్డి, సుంకిరెడ్డి, మాజీ ఎంపీపీ కోడెగ మస్తాన్‌రావు, పెనుగొండ బాల కోటిరెడ్డి, చింతల కోటి లింగారెడ్డి, మేడికొండ శేషగిరిరావు, వాకా రమణారెడ్డి, మైలా శ్రీరాములు, గూడూరు సీఐ పీ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌లు గోరంట్ల రాంబాబు, మం డల సీపీఎం నాయకులు వెల్లంపల్లి ఆంజనేయులు, బోడపాటి హనుమంతరావు, పంటా ఏడుకొండలు, వాతల రామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T22:51:37+05:30 IST