అర్జీదారులను తిప్పుకోవద్దు

ABN , First Publish Date - 2022-07-19T05:18:03+05:30 IST

వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారులను పదేపదే తిప్పుకోవద్దని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదే శించారు.

అర్జీదారులను తిప్పుకోవద్దు
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 18 : వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారులను పదేపదే తిప్పుకోవద్దని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదే శించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ అనంతరం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలుప్రాంతాల నుంచి వచ్చిన ప్రజానీకం తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  కార్యక్రమంలో డీఆర్వో పులి శ్రీనివాసులు, స్పెషల్‌ కలెక్టర్లు సరళావందనం, గ్లోరియా, నారదముని పాల్గొన్నారు. 

-ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీచేసే విధంగా చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళా వసంతరావు కోరారు. గతేడాది బ్లాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చినా ఇంకా పోస్టులు మిగిలి ఉన్నాయన్నారు. 

-విద్యా హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేసే విధంగా చూడాలని ఎం పీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ రజాక్‌ కోరారు. విద్యా హక్కు చట్ట ప్రకా రం పేద విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 25శాతం అమలు చేయాల్సి ఉన్నా ఎక్కడ అమలు  కావడం లేదన్నారు. అలా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజానీకం పలు రకాల సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు.

చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలి 

ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని కలెక్టర్‌ ది నేష్‌కుమార్‌ అన్నారు. పలు శాఖల్లో ఖాళీగాఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం స్థానిక స్పందన హాలులో నియామకపత్రాలను ఆయన అందజేశారు. ఆరుగురికి వాచ్‌మెన్‌, అ టెండర్‌, సబార్డినేట్‌ పోస్టులకు ఎం పిక చేసి నియామక పత్రాలను అందజేశారు.  కార్యక్రమంలో డీఆర్వో పులి శ్రీని వాసులు, పలుశాఖల అధికారులు లక్ష్మానాయక్‌, విజయభాస్కర్‌, జాలిరెడ్డి  ఉన్నారు.

పేద విద్యార్థులకు సహాయం అభినందనీయం

పేద విద్యార్థులకు సహాయం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని  కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద వి ద్యార్థులకు షెకీనా వెల్పేర్‌ సొసైటీ సోమవారం 700 లాంగ్‌నోటు పుస్తకాలను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో డీఈవో విజ య భాస్కర్‌, సొసైటీ ప్రతినిధులు ఉన్నారు. 


Updated Date - 2022-07-19T05:18:03+05:30 IST