ఉద్యమాన్ని దారి మళ్లిస్తున్నారు..

ABN , First Publish Date - 2022-03-06T05:17:02+05:30 IST

మార్కాపురం జిల్లా సాధన కోసం జేఏసీ చేపట్టిన ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ధ్వజమెత్తారు.

ఉద్యమాన్ని దారి మళ్లిస్తున్నారు..
మాట్లాడుతున్న కందుల నారాయణరెడ్డి

వైసీపీ నేతల తీరు గర్హనీయం

చిత్తశుద్ధి ఉంటే జేఏసీతో కలిసిరావాలి

మాజీ ఎమ్మెల్యే కందుల  నారాయణరెడ్డి

25వ రోజుకు చేరిన దీక్షలు 

మార్కాపురం, మార్చి 5: మార్కాపురం జిల్లా సాధన కోసం జేఏసీ చేపట్టిన ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట మార్కా పురం జిల్లా కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శని వారం 25వ రోజుకు చేరాయి. దీక్షలలో  న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఇమ్మడి కాశీనాథ్‌, షేక్‌ సైదా, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, జేఏసీ కోశాధికారి వక్కలగడ్డ మల్లికార్జున్‌ అందె నాసరయ్య, డీకేఎం రఫీ తదితరులు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా సాధన కోసం ఉద్యమం చేపట్టిన జేఏసీ నాయకులపై సామాజిక మాధ్యమాల ద్వారా అనుచిత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మీరు చేసే ఆరోపణలు కాదని నిరూపించడానికి దేనికైనా సిద్ధమేన న్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు వైసీపీ నాయకుల చేతకాని తనాన్ని పక్కదారి పట్టించేందుకు సామాజిక మాధ్యమాలను ఎంచుకోవ డం శోచనీయమన్నారు. తూర్పు పాంత్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద ప్రాబల్యం కోసం పశ్చిమ ప్రాంతంలో ని వైసీపీ నాయకులు మార్కాపురం డివిజన్‌ను తాకట్టు పెడుతున్నారన్నా రు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి న్యాయపరమైన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని న్యాయవాదులు హామీ ఇచ్చారు. 

దీక్షలలో న్యాయవాదులు శ్రీనివాస్‌ చౌదరి, మన్నెం సత్యనారాయణ, గుమ్మా గంగరాజు, కాశయ్య, తదితరులు కూర్చున్నారు. ఈ దీక్షలలో టీడీపీ నాయకులు షేక్‌ మౌలాలీ, కొప్పుల శ్రీనివాసులు, మర్రి కొండలు, సీపీఐ నాయకులుషేక్‌ ఖాసీం, ఆమ్‌ఆద్మీ జిల్లా అధ్యక్షుడు వి.సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు. దీక్ష అనంతరం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతికి వినతి పత్రం అందజేశారు. 


Updated Date - 2022-03-06T05:17:02+05:30 IST