గుప్తనిధుల కోసం ఇంట్లోనే తవ్వకాలు

ABN , First Publish Date - 2022-11-23T00:40:39+05:30 IST

గుప్తనిధు ల కోసం ఒక వ్యక్తి తన ఇంటిలో తవ్వి క్షుద్ర పూ జలు చేస్తున్నాడు. ఈ తంతు గత కొన్ని నెలలు నుంచి జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవా రం కూడా ఇంటి లోపల కూలీలు తవ్వుతున్నా రు. జరుగుతున్న వ్యవహారాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటి యాజమానిని, గుంతలు తవ్వతున్న కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుప్తనిధుల కోసం ఇంట్లోనే తవ్వకాలు

పోలీసుల దృష్టికి తీసుకొచ్చిన గ్రామస్థులు

ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ

సింగరాయకొండ, నవంబరు 22 : గుప్తనిధు ల కోసం ఒక వ్యక్తి తన ఇంటిలో తవ్వి క్షుద్ర పూ జలు చేస్తున్నాడు. ఈ తంతు గత కొన్ని నెలలు నుంచి జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవా రం కూడా ఇంటి లోపల కూలీలు తవ్వుతున్నా రు. జరుగుతున్న వ్యవహారాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటి యాజమానిని, గుంతలు తవ్వతున్న కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బింగినపల్లికి చెందిన పేరూరి సుబ్బారావు గ్రా మంలో ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఆరేళ్ల కిందట ఒంగోలు వెళ్లారు. కోర్టు సెం టర్‌లో టిఫిన్‌ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలోని ఇళ్లు అప్పటి నుంచే ఖాళీగా ఉంది. ఇటీవల కొన్ని నెలలుగా సుబ్బారావు తరచూ తను ఖాళీ చేసిన ఇంటికి వచ్చి వె ళ్తుతున్నారు. కొన్ని రోజుల నుంచి గుప్త నిధుల కోసం ఇంటిలో క్షుద్రపూజలు చేసి తవ్వకాలు మొదలుపెట్టాడు. గుంతలు లోతుగా తీయడం వల్ల వాటిల్లో నీరు ఊరింది. నీరును తొలగించి ఇంకా లోతు తీయడానికి ఒంగోలు నుంచి నలుగురు కూలీలను తీసుకొచ్చారు. సోమవారం రా త్రి నుంచి పైపుల ద్వారా నీటిని తొలగించడానికి కూలీలు పనిచేస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రంగనాథ్‌, ఎస్సై ఫిరోజ్‌ఫాతిమా సంఘటనా స్థ లాన్ని పరిశీలించారు. అదుపులోకి తీసుకొన్ను వారిని విచారిస్తున్నారు.

Updated Date - 2022-11-23T00:40:41+05:30 IST