వైసీపీ పాలనలో అన్నదాతలకు కష్టాలు
ABN , First Publish Date - 2022-12-16T23:51:56+05:30 IST
వైసీపీ పాలనలో అన్న దాతలకు ఆదరణ కరువైందని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవటంలో పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబ శివరావు ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
దెబ్బతిన్న పంటల పరిశీలన
సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించాలని డిమాండ్
పర్చూరు, డిసెంబరు 16: వైసీపీ పాలనలో అన్న దాతలకు ఆదరణ కరువైందని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవటంలో పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబ శివరావు ధ్వజమెత్తారు. శుక్రవారం పర్చూరు నియో జకవర్గంలోని యద్దనపూడి, చిన్నగంజాం మండలా ల పరిధిలో మాండస్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతి న్న మిరప, వైట్బర్లీ, మొక్కజొన్న పంటలను పరిశీ లించారు. ఈ సందర్భంగా అన్నదాతలు తమ గోడు ను ఎమ్మెల్యేకి వెళ్లబోసుకున్నారు.
ఏలూరి మాట్లాడుతూ వైసీపీ మూడున్నరేళ్ళ పా లనలో అన్నదాతలకు ఒరిగింది ఏమీలేదన్నారు. భూ మిని నమ్ముకున్న రైతులు అప్పులు తెచ్చి పెట్టుబ డులు పెట్టి పంటలను సాగుచేస్తున్నారని చెప్పారు. తుఫాన్ ప్రభావంతో పంటలన్నీ నీటమునిగి రైతన్న లు కోలుకోలేని స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను పరిశీలించే తీరిక, ఓపిక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు లేకపోవటం బాధా కరమన్నారు. పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ యంత్రాగం పటిష్టంగా పంట నష్టం సమ గ్ర సర్వే నిర్వహించి అన్నదాతలను ఆదుకోవాలన్నా రు. తుఫాన్ దాటికి నష్టపోయిన రైతులందరికీ నూ రుశాతం సబ్సిడీపై విత్తనాలు ఎరువులను అందిం చాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేల ఎకరాల్లో పంటను నష్టపోయిన రైతులను ఆదుకోవా లని డిమాండ్ చేశారు.
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం
చినగంజాం, డిసెంబరు 16: రైతుల ను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్య మైందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు ధ్వజమెత్తారు. మండలంలోని నీ లాయపాలెం గ్రామంలో ఇటీవల మాం డస్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షా లకు దెబ్బతిన్న మిరప, ఎర్రజొన్న, శన గ, ధనియాలు తదితర పంటలను శుక్ర వారం ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పంట నష్ట అంచనాలు త్వరితగతిన పూర్తిచేసి రైతు లకు న్యాయం చేయాలన్నారు. రైతులకు మద్దతు ధర కూడా అందించలేక ప్రభుత్వం చేతులెత్తేసిం దని అన్నారు. కార్యక్రమంలో నీలాయపాలెం సర్పం చ్ తూమాటి శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షు డు పొద వీరయ్య, రైతులు ఆరే సురేంద్ర, ఆదినారా యణ, గుడివాడప్రసన్న, వేణుగోపాలం, మాగులూ రి ఆంజనేయులు, పాలేటి లక్ష్మీనారాయణ తదితరు లు పాల్గొన్నారు.