నాటుసారా బట్టీ ధ్వంసం

ABN , First Publish Date - 2022-04-10T06:40:30+05:30 IST

కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని వెంగాయపాలెం గ్రామ పొలిమేర్లలోని నాటుసారా బట్టీపై ఎస్‌ఐ పులి శివనాగరాజు తన సిబ్బందితో కలసి దాడి చేశారు.

నాటుసారా బట్టీ ధ్వంసం
బట్టీలను ధ్వసం చేస్తున్న సిబ్బంది

కురిచేడు, ఏప్రిల్‌ 9: కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని వెంగాయపాలెం గ్రామ పొలిమేర్లలోని నాటుసారా బట్టీపై ఎస్‌ఐ పులి శివనాగరాజు తన సిబ్బందితో కలసి దాడి చేశారు. అక్కడ ఉన్న నాటు సారా తయారీ వస్తువులు, డ్రమ్ములలో ఉన్న బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వెంగాయపాలెం పక్కనే గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం చెన్నారెడ్డి కాలనీ గ్రామం ఉంది. ఆ గ్రామంలో నాటు సారా తయారీ కుటీర పరిశ్రమలా ఉంది. అక్కడి వారు కొద్దికాలం నుంచి వెంగాయపాలెం గ్రామ పొలిమేర్లలో నాటు సారా తయారు చేసి వారి గ్రామంలోకి తీసుకెళ్లి అమ్మకాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బట్టీలను ధ్వసం చేశారు. తయారీ దారులు మాత్రం పోలీసులకు చిక్కలేదు. నాటుసారా తయారీపై సమాచారం పోలీసులకు తెలియజేయాలని ఎస్సై కోరారు.
నాటుసారా విక్రేతల ఇళ్లలో సోదాలు
కురిచేడు : కురిచేడుతో గతంలో నాటు సారా విక్రయించిన వారి గృహాలలో శనివారం కురిచేడు పోలీసులు సోదాలు చేశారు. దర్శి ఎస్‌ఈబీ అధికారులు, కురిచేడు పోలీసులు సంయుక్తంగా సోదాలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ పులి శివనాగరాజు తెలిపారు. గతంలో సారా అమ్మకందారులను నాటు సారా అమ్మవద్దంటూ హెచ్చరించారు. అయితే వారి సోదాలలో ఎక్కడా నాటుసారా చిక్కలేదు. ఈ సోదాలలో కురిచేడు పోలీస్‌ సిబ్బంది, దర్శి ఎస్‌ఈబీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-04-10T06:40:30+05:30 IST