రెండో రోజూ కొవిడ్‌ కేసులు నిల్‌

ABN , First Publish Date - 2022-08-10T05:56:12+05:30 IST

జిల్లాలో ఎక్కడా మంగళవారం కూడా కొవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు.

రెండో రోజూ కొవిడ్‌ కేసులు నిల్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 9 : జిల్లాలో ఎక్కడా మంగళవారం కూడా కొవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. కొంతకాలంగా రోజువారీ నాలుగైదు కేసులు వస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. అయితే రెండు రోజుల నుంచి ఎలాంటి కేసూ వెలుగు చూడకపోవడం ఊరటనిస్తోంది. మంగళవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో 91మందికి కరోనా పరీక్షలు చేయగా ఒక్కరికి కూడా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. జిల్లాలో ప్రస్తుతం 39 యాక్టివ్‌ కేసులు ఉండగా ఇద్దరు వైద్యశాలలో చికిత్సపొందుతున్నారు. 37మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 

Read more