శవ రాజకీయాలు మానుకోవాలి

ABN , First Publish Date - 2022-12-31T00:32:38+05:30 IST

కందు కూరులోని చంద్రబాబునాయుడు పర్యటనలో చో టుచేసుకున్న ఘటన బాధకరమని, దీనిపై వైసీపీ శవరాజకీయాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచ ర్ల జనార్దన్‌ పేర్కొన్నారు.

శవ రాజకీయాలు మానుకోవాలి

వైసీపీ నాయకులపై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల ధ్వజం

కందుకూరు మృతులకు ఘన నివాళి

ఒంగోలు(కార్పొరేషన్‌), డిసెంబరు 30 : కందు కూరులోని చంద్రబాబునాయుడు పర్యటనలో చో టుచేసుకున్న ఘటన బాధకరమని, దీనిపై వైసీపీ శవరాజకీయాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచ ర్ల జనార్దన్‌ పేర్కొన్నారు. కందుకూరులో మరణిం చిన వారికి శుక్రవారం ఒంగోలులో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. స్థానిక ఎన్టీఆర్‌ భవనం నుం చి అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్ర హం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో దామచర్ల మాట్లాడు తూ పార్టీ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న కార్యక ర్తల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తె లియజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం స్ప ష్టంగా కనిపిస్తుందని మండిపడ్డారు. మృతుల కు టుంబాలను అన్నీ విధాలుగా టీడీపీ ఆదుకుం టుందని చెప్పారు. ఇప్పటికే ఒకొక్కరి కుటుంబా నికి రూ.26 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. వారి మృతి పార్టీకి తీరని లోటున్నా రు. ఈ సందర్భంగా కొంచెంసేపు మౌనం పాటిం చి తమ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

నేడు నూతన సంవత్సర వేడుకలకు దూరం

ప్రతి సంవత్సరం ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డిసెంబరు 31వ తేదీన ని ర్వహించే నూతన సంవత్సర స్వాగత వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు దామచర్ల తెలిపారు. కం దుకూరులో జరిగిన ఘటనకు చింతిస్తూ ఈ ని ర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ కార్యాలయం లో ఈ వేడుకలు జరపడం లేదని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-31T00:32:44+05:30 IST