-
-
Home » Andhra Pradesh » Prakasam » Coral life is ideal-MRGS-AndhraPradesh
-
పగడాల జీవితం ఆదర్శనీయం
ABN , First Publish Date - 2022-02-20T04:33:58+05:30 IST
మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య జీవితం ఆదర్శనీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు.

రాచర్ల, ఫిబ్రవరి 19 : మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య జీవితం ఆదర్శనీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. మండలంలోని చినగానిపల్లె గ్రామంలో ఆయన స్వగృహంలో శనివారం వర్ధంతి కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పగడాల రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంచలంచలుగా ఎదిగి ఉ మ్మడి రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో బేస్తవారపేట ఎంపీపీ ఓసూరారెడ్డి, రాచర్ల జడ్పీటీసీ పగడాల దేవి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కుప్పా రంగనాయకులు, సర్పంచ్‌లు సగినాల రాయలమ్మ, శిరి గిరి రమేష్, లతీఫ్‌ఖాన్, జిల్లా సర్పంచ్‌ల సంఘం కార్యదర్శి, చినగానిపల్లె సర్పంచ్ పగడాల రమేష్, గిద్దలూరు మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ ఆర్.డి.రామకృష్ణ, ముద్దర్ల శ్రీను, రాచర్ల, అనంపల్లె ఎంపీటీసీ సభ్యులు చిట్టెం ఎలీసమ్మ, ఏలం రాజేశ్వరి, సూరా పాండురంగారెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు పఠాన్ జఫ్రుల్లాఖాన్, గోతం నారాయణ, ముత్యాల మధు పాల్గొన్నారు.