పారిశుధ్య కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2022-12-07T22:09:33+05:30 IST

నగర పంచాయతీ కార్మికులను వెం టనే ఆప్కాస్‌లో చేర్చాలని పం చాయతీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎం ప్లాయీస్‌ యూని యన్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు.

పారిశుధ్య కార్మికుల ఆందోళన
కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు

కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలి

సమస్యలు పరిష్కరించకుంటే 20 నుంచి విధుల బహిష్కరణ

పొదిలి రూరల్‌, డిసెంబరు 7 : నగర పంచాయతీ కార్మికులను వెం టనే ఆప్కాస్‌లో చేర్చాలని పం చాయతీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎం ప్లాయీస్‌ యూని యన్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలపై అధికారు లు తీవ్ర జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. పారిశుధ్య కార్మికులను ఆప్కాస్‌లో చేర్చి రూ.15వేల వే తనంతోపాటు హెల్త్‌ అలెవెన్స్‌ రూ.6వేలు కలిపి మొత్తం రూ.21వేలను ఇవ్వాలని అధ్యక్ష, కార్యద ర్శులు నాగులు, సుబ్బయ్య నగర పంచాయతీ కార్యాలయం వద్ద జరి గిన ధర్నాలో డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం. రమేష్‌ మాట్లాడుతూ రెండు సం వత్సరాల క్రితం మేజర్‌ పంచాయతీ నుంచి నగర పం చాయతీగా మారినా ప్రయోజనం లేదన్నారు. నేటికీ కార్మికులకు హెల్‌త అలవెన్స్‌లు ఇవ్వడం లేదన్నారు. అధికారుల ని ర్లక్ష్యం కారణంగా ఒక్కో కార్మికుడు ఏడాదికి లక్షా 60వేలు నష్టపో యారన్నారు. పారిశుధ్య ట్రాక్టర్‌ డ్రైవర్‌కు కనీస వేతనం రూ.18500 ఇ వ్వాలన్నారు. వెంటనే స్పందించకపోతే ఈనెల 20 నుంచి విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2022-12-07T22:09:38+05:30 IST