బాధితులకు పరిహారం అందజేత
ABN , First Publish Date - 2022-12-15T23:59:24+05:30 IST
పుల్లలచెరువు మండలం రంగన్నపాలెం వద్ద కొత్తగా నిర్మించనున్న 220 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి 11.75 ఎకరాలు భూమి ఇచ్చిన నలుగురు రైతులకు రూ.1,28,12,500 పరిహారం చెక్కులను మం త్రి సురేష్ పంపిణీ చేశారు.
ఎర్రగొండపాలెం, డిసెంబరు 15 : వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రాష్ట్రపురపాలక పట్టణాభివృద్ది శాఖమంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పుల్లలచెరువు మండలం రంగన్నపాలెం వద్ద కొత్తగా నిర్మించనున్న 220 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి 11.75 ఎకరాలు భూమి ఇచ్చిన నలుగురు రైతులకు రూ.1,28,12,500 పరిహారం చెక్కులను మం త్రి సురేష్ పంపిణీ చేశారు. ఈ ఉప కేంద్రం నిర్మాణం పూర్తయితే ఎర్రగొండపా లెం, పుల్లలచెరువు మండలాల్లో విద్యుత్తు సమస్య తీరిపోతుందన్నారు. రైతులకు కార్యక్రమంలో పుల్లలచెరువు తహసీల్దారు కే.దాసు, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ బీవీ.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
పేదలకువరం ముఖ్యమంత్రి సహాయనిధి
పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల్లో 14 మందికి మంజూరైన రూ.14.73 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీపీటీసీలు పాల్గొన్నారు. అనంతరం ఎర్రగొండ పాలెంలోని ప్రధాన కూడలిలో పొట్టి శ్రీరా ములు విగ్రహానికి నివాళి అర్పించారు. తెలు గు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహో న్నత నేత శ్రీరాములు అని పేర్కొన్నారు.
పుల్లలచెరువు : మండలంలోని గంగవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ రెంటపల్లి సుబ్బారెడ్డి, సర్పంచ్ జొన్నగిరి వెంకటరెడ్డి పాల్గొన్నారు.