15 న సీఎం రాక

ABN , First Publish Date - 2022-12-07T23:59:40+05:30 IST

దర్శిలో ఈనెల 15వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌పర్యటించనున్న సందర్భంగా దర్శి-కురిచేడు రోడ్డులోని శివరాజ్‌నగర్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను ఎస్పీ మలికగర్గ్‌ పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా భద్రతా, బందోబస్తు, బారికేడ్ల ఏర్పాట్లు, పార్కింగ్‌ ప్రదేశాల ఎంపిక, కాన్వాయ్‌ రూట్‌, రిసెప్షన్‌ ఏర్పాటు స్థలాన్ని ఎస్‌పీ పరిశీలించారు.

15 న సీఎం రాక

దర్శి, డిసెంబరు 7 : దర్శిలో ఈనెల 15వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌పర్యటించనున్న సందర్భంగా దర్శి-కురిచేడు రోడ్డులోని శివరాజ్‌నగర్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను ఎస్పీ మలికగర్గ్‌ పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా భద్రతా, బందోబస్తు, బారికేడ్ల ఏర్పాట్లు, పార్కింగ్‌ ప్రదేశాల ఎంపిక, కాన్వాయ్‌ రూట్‌, రిసెప్షన్‌ ఏర్పాటు స్థలాన్ని ఎస్‌పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ కె. నాగేశ్వరరావు, దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, డీఎ్‌సబీ బి మరియదాసు, దర్శి, పొదిలి, త్రిపురాంతకం సీఐలు రామకోటయ్య, సుధాకర్‌, రాంబాబు, దర్శి ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:59:42+05:30 IST