38 పాఠశాలలకు స్వచ్ఛవిద్యాలయ పురస్కారాలు

ABN , First Publish Date - 2022-06-29T06:15:00+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛవిద్యాలయ పురస్కారాలకు 2021-22 సంవత్సరానికి జిల్లాలోని 38 పాఠ శాలలు ఎంపికయ్యాయి.

38 పాఠశాలలకు స్వచ్ఛవిద్యాలయ పురస్కారాలు

ఒంగోలు(విద్య) జూన్‌ 28: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛవిద్యాలయ పురస్కారాలకు 2021-22 సంవత్సరానికి జిల్లాలోని 38 పాఠ శాలలు ఎంపికయ్యాయి. పాఠశాలల్లో తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రతతోపాటు కొవిడ్‌-19 సంసిద్ధత, ప్రతిస్పందన అంశాల్లో మెరుగైన పనితీరును చూపినందుకు వీటిని ఎంపిక చేశారు. అన్ని అంశాల్లో మెరుగ్గా ఉన్నందుకు 30 పాఠశాలలను అంశాల వారీగా పురస్కారానికి పరిగణనలోకి తీసుకున్నారు. ఓవరాల్‌ అవార్డుకు ఎంపికైన 8 పాఠశాలలకు 60వేల చొప్పున, సబ్‌ కేటగిరీలో ఎంపికైన 30 పాఠశాలలకు రూ.20వేల చొప్పున సమగ్ర శిక్ష ద్వారా గ్రాంటును అదనంగా కేటాయిస్తారు.

 

ఎంపికైన పాఠశాలలు ఇవే 

ఓవరాల్‌ కేటగిరీ కింద మూరారిపల్లి, గుండాయపాలెం, ఒంగోలు బాలాజీనగర్‌, చవిటిపాలెం, ముండ్లపాడు, వైపాలెం, ఒంగోలు బండ్లమిట్ట, పేరంగుడిపాడు పాఠశాలలు ఉన్నాయి. సబ్‌కేటగిరీలో యర్రగుడిపాడు, తురిమెళ్ల, శేషంవారిపాలెం, పొట్లూరు, మహాదేవపురం, ఇడమకల్లు, మూగచింతల, జొన్నతాళి, అద్దంకి, వెలగపూడి, అంకభూపాలపురం, తిమ్మాయపాలెం, కాకర్ల, గిద్దలూరు బాలికల, దైవాలరావూరు, మార్కాపురం బాలికల, బొబ్బేపల్లి, ఓబులక్కపల్లి, పి.నాగులవరం, అద్దంకి శ్రీప్రకాశం, దర్శి, కందుకూరు కేజీబీవీ, పొదిలి యానాదికాలనీ, పెదవరిమడుగు, దర్శి పశ్చిమ, మార్కాపురం మునిసిపల్‌ 1వవార్డు, పీఎస్‌కాలనీ ఆరవ వార్డు స్కూలు అవార్డులకు ఎంపికయ్యాయి.


1న పురస్కారాలు ప్రదానం

ఎంపికైన పాఠశాలలకు వచ్చేనెల 1న కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జరిగే కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్లు డీఈవో విజయభాస్కర్‌, ఏపీసీ శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని పురస్కారాలు అందజేస్తారని తెలిపారు. 


Updated Date - 2022-06-29T06:15:00+05:30 IST