అక్షయ్‌ గోల్డ్‌ అటాచ్‌మెంట్‌ ఆస్తిపై సీఐడీ విచారణ

ABN , First Publish Date - 2022-12-10T00:28:13+05:30 IST

ప్రజలకు రూ. కోట్లలో టోకరా వేసిన అక్షయ గోల్డ్‌ అటాచ్‌మెంట్‌ ఆస్తులపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. ఒంగోలు కర్నూల్‌రోడ్డులోని కేబీ రెసిడెన్సీ ఉన్న వివాదాస్పద స్థలాన్ని సీఐడీ అధికారులు శుక్రవా రం పరిశీలించారు.

అక్షయ్‌ గోల్డ్‌ అటాచ్‌మెంట్‌ ఆస్తిపై సీఐడీ విచారణ

ఒంగోలులోని కేబీ రెసిడెన్సీలో తనిఖీలు

వివాదాస్పద స్థలం సర్వే

ఒంగోలు(క్రైం), డిసెంబరు 9: ప్రజలకు రూ. కోట్లలో టోకరా వేసిన అక్షయ గోల్డ్‌ అటాచ్‌మెంట్‌ ఆస్తులపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. ఒంగోలు కర్నూల్‌రోడ్డులోని కేబీ రెసిడెన్సీ ఉన్న వివాదాస్పద స్థలాన్ని సీఐడీ అధికారులు శుక్రవా రం పరిశీలించారు. అందులో కోర్టుకు అటాచ్‌ చే సిన స్థలం 80శాతం ఉన్నట్లు తేల్చారు. అక్షయ గోల్డ్‌ కంపెనీ గతంలో ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి భారీగా డిపాజిట్లు సేకరించింది. వాటిని తి రిగి డిపాజిటర్‌లకు చెల్లించకుండా డైరెక్టర్లు సొం త ఆస్తులు కొనుగోలు చేశారు. బాధితుల ఫిర్యా దు మేరకు సీఐడీ రంగంలోకి దిగింది. అక్షయ్‌ గో ల్డ్‌ డైరెక్టర్‌ రమేష్‌బాబు సంబంధించిన ఆస్తుల్లో కేబీ రెసిడెన్సీ నిర్మించిన స్థలం కూడా ఉన్నట్లు గు ర్తించింది. దాన్ని 2014లో అక్షయ్‌ గోల్డ్‌ కేసులో కోర్టుకు అటాచ్‌మెంట్‌ చేసింది. అయితే అటాచ్‌ మెంట్‌లో ఉన్న రూ.కోట్ల విలువైన ఆస్తిని కేబీ రె సిడెన్సీ యజమాని వీరయ్య అక్రమంగా స్వాధీ నం చేసుకొని నిర్మాణాలు చేపట్టినట్లు సీఐడీ అ ధికారులు గుర్తించారు. అందులో బార్‌ అండ్‌ రె స్టారెంట్‌, లాడ్జి నడుపుతున్నారు. డిపాజిటర్ల చ ట్టం ప్రకారం ఇలాంటి ఆస్తి నుంచి వచ్చే అద్దె డి పాజిటర్లకు చెందాల్సి ఉంది. ప్రస్తుతం వీరయ్య ఎలాంటి అద్దె చెల్లించకుండా అక్రమంగా నిర్మా ణాలు చేసి అనుభవిస్తున్నట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నారు. దీంతో డిపాజిటర్లకు నష్టం వాటి ల్లుతుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో గుంటూ రు సీఐడీ అదనపు ఎస్పీ అజయ్‌ ప్రసాద్‌ మూ డు రోజుల క్రితం ఒంగోలు వచ్చి కేబీ రెసిడెన్సీని పరిశీలించారు. ఒంగోలు కార్పొరేషన్‌ టౌన్‌ప్లానిం గ్‌ అధికారులకు నోటీసులు ఇచ్చి అధికారికంగా కొలతలు వేయాలని కోరేరు. దీంతో శుక్రవారం గుంటూరు నుంచి సీఐడీ అధికారుల బృందం వ చ్చింది. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో సర్వే చేయిం చి అటాచ్‌మెంట్‌లో ఉన్న భూమి ఎంత? అందు లో ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి? అన్నది గు ర్తించారు. ఈ మొత్తాన్ని కోర్టుకు సమర్పిస్తామని, న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐడీ అధికారులు చెప్తున్నారు. సీఐడీ బృందంలో ఇన్‌స్పెక్టర్లు సంజయ్‌కుమార్‌, జగదీష్‌, బ్రహ్మంతోపాటు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-12-10T00:28:16+05:30 IST