21న చేయూత మహిళా మార్ట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-15T23:17:06+05:30 IST

టంగుటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన చే యూత మహిళా మార్ట్‌ను ఈనెల 21న ప్రారంభించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ బాబూరావు తెలిపారు.

21న చేయూత మహిళా మార్ట్‌ ప్రారంభం

టంగుటూరు, డిసెంబరు 15: టంగుటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన చే యూత మహిళా మార్ట్‌ను ఈనెల 21న ప్రారంభించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ బాబూరావు తెలిపారు. గురువారం స్థానిక మండల మహి ళా సమాఖ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా మార్ట్‌ సేవలను సభ్యులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సభ్యులంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వాటా ధనాన్ని శనివారంలోగా చెల్లించాలని, వాటా ధనంతోనే మార్ట్‌ కొనసాగుతుందన్న విషయం గుర్తించుకోవాలని చెప్పారు. మండలంలో మొత్తం 1,840 స్వయం సహాయక సంఘాలున్నాయని, ఇందులో 19వేల మంది స భ్యులున్నట్లు చెప్పారు. మార్ట్‌లో నాణ్యతతో కూడిన అన్ని రకాల వస్తువులు అందుబాటు ధరల్లో ఉంటాయని, కంపెనీల నుంచి తెచ్చిన సరుకులు నేరుగా వినియోగదారులకు అమ్మకాలు జరుగుతాయని, లాభాపేక్షలేని వ్యాపారం కనుక బయట మా ర్కెట్‌ ధరలతో పోల్చితే ఇక్కడ తక్కువ ధరలుంటాయన్నారు. మార్ట్‌ ప్రారంభోత్సవానికి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల) గోపాలక్రిష్ణ ద్వివేది, సెర్ప్‌ సీఈవో మహమ్మద్‌ ఇంతియాజ్‌ హాజరుకానున్నట్లు వెల్లడించారు. సభ్యులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో ఏపీఎం బెజ్జం రమే్‌షబాబు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:17:08+05:30 IST