టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా చంద్రబోస్‌

ABN , First Publish Date - 2022-09-19T03:06:30+05:30 IST

డీపీ లీగల్‌ సెల్‌ కనిగిరి అసెంబ్లీ అధ్యక్షుడిగా రాచపూడి సుభాష్‌ చంద్రబోస్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా చంద్రబోస్‌
చంద్రబోస్‌కు నియామకపత్రం అందజేస్తున్న సన్నెబోయిన

కనిగిరి, సెప్టెంబరు 18 : టీడీపీ లీగల్‌ సెల్‌ కనిగిరి అసెంబ్లీ అధ్యక్షుడిగా రాచపూడి సుభాష్‌ చంద్రబోస్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈమేరకు ఒంగోలు పార్లమెంట్‌ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులనాయుడు ఆదివారం చంద్రబోస్‌కు నియామకపత్రం అందచేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి సూచనల మేరకు చంద్రబోస్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి అసెంబ్లీ లీగల్‌ సెల్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు చెప్పారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా పోకూరి కోటయ్య, జనరల్‌ సెక్రటరీగా ఎం.విద్యాయాదవ్‌, అధికార ప్రతినిధిగా జి సుబ్బారావు ఎంపికయ్యారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌  న్యాయ విభాగ అఽధికార  ప్రధాన కార్యదర్శి షేక్‌ మహ్మద్‌వలి, అధికార ప్రతినిధి షేక్‌ షబ్బీర్‌, మురళీకృష్ణ, కొండేపి న్యాయ విభాగం ప్రధాన కార్యదర్శి బి నాగేశ్వరరావు పాల్గొన్నారు.   


Updated Date - 2022-09-19T03:06:30+05:30 IST