చలివేంద్రం ఏర్పాటు

ABN , First Publish Date - 2022-03-23T05:39:02+05:30 IST

కంభం ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు ఉచిత తాగునీటి కూలింగ్‌ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

చలివేంద్రం ఏర్పాటు
చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న డీఎం సుధాకర్‌రావు


కంభం, మార్చి 22 : కంభం ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు ఉచిత తాగునీటి కూలింగ్‌ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం గిద్దలూరు ఆర్టీసీ డిపో మేనేజర్‌ సుధాకర్‌రావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన దాత  మాజీ జడ్పీటీసీ సభ్యుడు సయ్యద్‌ జాకీర్‌ అభినందనీయుడని డీఎం కొనియాడారు.  మాజీ జడ్పీటీసీ జాకీర్‌ అన్న ఎస్‌ఏ రషీద్‌ జ్ఞాపకార్థం బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం డిపో మేనేజర్‌ సుధాకర్‌రావు ప్రారంభించారు. బస్టాండ్‌కు అనేక ప్రాంతాల నుంచి ప్రయాణికులు  వచ్చిపోతూ ఉంటారని, వేసవిలో నీటి కోసం కూల్‌డ్రింక్‌ షాపుల్లో అధిక రేట్లకు అమ్ముతున్నారు. కానీ జాకీర్‌ గత 5 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్న చలివేంద్రం వలన ప్రయాణికులు దాహార్తి తీర్చుకుంటున్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని డీఎం సుధాకర్‌రావు కోరారు.  కార్యక్రమంలో సర్పంచ్‌లు బోడయ్య, మహబూబ్‌పీరా,  మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ నెమలిదిన్నె చెన్నారెడ్డి, మాజీ కోఆప్షన్‌ మెంబర్‌ హుస్సేన్‌బాషా,  ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.  


Updated Date - 2022-03-23T05:39:02+05:30 IST