సెంట్రల్‌ లైటింగ్‌ నిర్వహణ అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-05-24T05:35:05+05:30 IST

అద్దంకి ప ట్టణానికి కొంత సొగసు తెచ్చి న నామ్‌ రోడ్డు సెంట్రల్‌ లై టింగ్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

సెంట్రల్‌ లైటింగ్‌ నిర్వహణ అస్తవ్యస్తం
శింగరకొండ సమీపంలో ఒక వైపు వెలగని సెంట్రల్‌ లైటింగ్‌ లైట్లు, వెలగని బ్యూటిఫికేషన్‌ లైటింగ్‌

రెండు నెలలకే మసకబారిన వైనం

మూన్నాళ్ల ముచ్చటగా బ్యూటిఫికేషన్‌ లైటింగ్‌ 

అద్దంకి, మే 23: అద్దంకి ప ట్టణానికి కొంత సొగసు తెచ్చి న నామ్‌ రోడ్డు సెంట్రల్‌ లై టింగ్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సుమారు రూ.2 కోట్లతో నామ్‌ రోడ్డు నిర్వహణ సంస్థ, మరో కోటి రూపాయల నగరపంచాయతీ నిధులతో ఇందుకు రూపకల్పన చేశారు. అద్దంకి పట్టణంలోని నామ్‌ రోడ్డులో నల్లవాగు వద్ద నుండి శింగరకొండ సమీపంలోని జం క్షన్‌ వరకు  సుమారు 5 కి.మీ దూరం సుమారు 250  పోల్స్‌ తో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. అదే సమయంలో  సుమారు రూ.20 లక్షలతో సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాలకు బ్యూటిఫికేషన్‌ లైటింగ్‌  ఏర్పాటుచేశారు. నామ్‌ రోడ్డు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఐదారు నె లల క్రితం ఏర్పాటుచేయగా, నగరపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌, బ్యూటిఫికేషన్‌ లైటింగ్‌ పనులను శింగరకొం డ తిరుణాళ్ళు సందర్భంగా ప్రారంభించారు. పట్టుమని రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే పలుచోట్ల లైట్లు వెలగటం లేదు. వరుసగా పలు స్తంభాల లైట్లు వెలగక పోవటం ఆయా ప్రాంతాలలో చీకటిగా మారింది. ఇక బ్యూటిఫికేషన్‌ లైటింగ్‌ చాలా చోట్ల వెలగక పోవటంతో అంద విహీనంగా కనిపిస్తుంది.

 నగర పంచాయతీ ఆద్వర్యంలో బంగ్లా రోడ్డు, నగర పంచాయతీ కార్యాలయం రోడ్డులో ఏర్పాటుచేసిన సెంట్రల్‌ లైటింగ్‌ బాగానే పని చేస్తుండగా, నామ్‌ రోడ్డులో అతితక్కువ కాలంలో మరమ్మతులకు గు రవుతున్నాయి. మరమ్మతులను వెంటనే చేపట్టకుండా వదిలివేయ టంతో అందంగా కనిపించాల్సిన నామ్‌ రోడ్డు అందవిహీనంగా  మా రిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నామ్‌ రోడ్డు పొడవునా  మిగిలిన ఏ ప్రాంతంలో లేని విధంగా అద్దంకిలో సెంట్రల్‌ లైటింగ్‌తో వచ్చిన కొత్త వెలుగులు మసకబారుతుండటంతో పలువురు పెదవి వి రుస్తున్నారు. ఇప్పటికైనా నామ్‌ రోడ్డు నిర్వహణ సంస్థ, అద్దంకి నగర పంచాయతీ ఆధ్వర్యంలో సెంట్రల్‌ లైటింగ్‌కు ఎప్పటికప్పుడు మరమ్మ తులు చేస్తూ శోభ అదే విధంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని ప లువురు కోరుతున్నారు.

Updated Date - 2022-05-24T05:35:05+05:30 IST