పశువుల మేత భూమి ఆక్రమణ

ABN , First Publish Date - 2022-08-02T05:13:56+05:30 IST

నోరులేని మూగ జీవాలకు మేత కోసం ప్రభుత్వం గ్రామాల్లో పశువుల మేత భూములను ఏ ర్పాటు చేసింది.

పశువుల మేత భూమి ఆక్రమణ
రాస్తారొకో చేస్తున్న పోషకులు

పోషకుల రాస్తారోకో

అధికారుల హామీతో ఆందోళన విరమణ

యర్రబాలెం(దొనకొండ), ఆగస్టు 1 : నోరులేని మూగ జీవాలకు మేత కోసం ప్రభుత్వం గ్రామాల్లో పశువుల మేత భూములను ఏ ర్పాటు చేసింది. అయితే యర్రబాలెం గ్రామా నికి చెందిన పశువుల మేత భూమిని కొందరు దర్జాగా కబ్జా చేసి సాగు చేసుకుంటూ పంట లు పండించుకుంటున్నారు. మరికొందరు   ఆ క్రమించుకున్న భూములను కౌలుకు ఇచ్చి కౌలు పొందుతున్నారని దీంతో తాము పశు వులను మేపుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నామని గ్రామానికి చెందిన పశు పోషకులు వందలాది పశువులతో దొనకొండ - వినుకొండ ప్రధాన రహదారిపై అడ్డంగా కూ ర్చొని నినాదాలు చేస్తూ సోమవారం అరగంట సేపు రాస్తారొకో కార్యక్రమం చేపట్టారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వాహన చోదకులు వా హనాలు నిలిచిపోవటంతో ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. సమాచారం తెలుసుకొని స్పం దించిన తహసీల్దార్‌ కె.వెంకటేశ్వరరావు ఆదే శాల మేరకు ఆర్‌ఐ నాగార్జునరెడ్డి, వీఆర్వో ఐలూరి పిచ్చిరెడ్డి సంఘటనా ప్రదేశానికి హు టాహుటిన చేరుకున్నారు. పశువుల మేత భూ మి ఆక్రమణకు గురైన విషయం తమ దృష్టికి రాలేదని తక్షణమే విచారణ చేపట్టి ఆక్ర మణలను తొలగించేలా చర్యలు చేపడతామని ఈ విషయం తహసీల్దార్‌ స్పష్టం చేశారని వా రికి హమీ ఇవ్వటంతో పశుపొషకులు రాస్తా రోకో విరమించారు. మండల కేంద్రమైన దొనకొండ పంచాయతీలోని యర్రబాలెం గ్రామం లో సర్వే నెంబర్లు 52/1లో 220.43, 45లో 34, 53/1లో 1.21, 55లో 9.49, 56/2లో 13.75, 97లో 13.20, 115లో 1.96, 143/5లో 0.58 మొత్తం 294.62 ఎకరాల పశువుల మేత భూ మి ఉంది. గ్రామానికి చెందిన కొందరు, ఇతర గ్రామాలకు చెందిన మరికొందరు గతంలో పశువుల మేత భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటూ పంటలు పండించుకుం టున్న విషయం అప్పట్లో పశుపోషకులు అధి కారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అధికా రు లు ఆక్రమణలను తొలగించి ఆ ప్రాంతంలో ప్రభుత్వభూమిగా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటీవల కొందరు ఆక్రమణదారులు అధి కారులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి మేతభూమిని యథేచ్ఛగా  ఆక్రమించుకొని సా గుచేసుకుంటూ మేతకోసం తమ పశువులను ఆవైపుకు రానివ్వకుండా తమపై దౌర్జన్యం చేస్త్తున్నారని యరబ్రాలెం గ్రామ పశు పోషకులు వాపోయారు. దీంతో నోరులేని మూ గజీవాలను మేపుకునేందుకు తాము తీవ్ర ఇ బ్బందులు పడుతున్నామని గ్రామంలో దాదా పు మూడు వేల వరకు మూగజీవాలు ఉన్నా యని పశువుల మేతభూమి ఆక్రమణకు గురి కావటంతో వాటిని ఏవిధంగా పోషించుకో వాలో అర్ధంకావడం లేదని వారు ఆవేదన వ్య క్తం చేశారు.   పశువుల మేతభూములను ఆ క్రమించుకున్న వారిపై చర్యలు తీసుకొని అధి కారులు తమకు న్యాయం చేయకుంటే తమకు ఆత్మహత్యలు తప్పవని వారు హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి మేతభూములను ఆక్రమించుకున్న వారిపై తగు చర్యలు చేపట్టి తమ పశువులకు మేతకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని యర్రబాలెం గ్రామ పశుపోషకులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-02T05:13:56+05:30 IST