నిర్మించారు.. ప్రారంభం మరిచారు

ABN , First Publish Date - 2022-06-28T06:39:48+05:30 IST

మండల కేంద్రమైన రాచర్లలో బీసీ భవనం పూర్తి అయినప్పటికీ వాటికి మంజూరైన నిధులు రాకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు.

నిర్మించారు.. ప్రారంభం మరిచారు
నిర్మించి వదిలేసిన భవనం

రాచర్ల, జూన్‌ 27 : మండల కేంద్రమైన రాచర్లలో బీసీ భవనం పూర్తి అయినప్పటికీ వాటికి మంజూరైన నిధులు రాకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. 2018లో అప్పటి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌ కింద రూ.40 లక్షలు నిధులు మంజూరు చేసింది. దీంతో తహసీల్దార్‌ కార్యాలయం వెనుక బీసీ భవ నం పనులు ప్రారంభించి 2020లో పూర్తి చేశారు. మండలంలో ఎక్కువగా బీసీలుండగా బీసీల కోసం ఈ భవనంలో అనేక కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో బీసీ భవనం పూర్తిస్థాయిలో ప్రారంభానికి నోచుకోలేదు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

నిధులు మంజూరు చేయాలి

బీసీ భవనం రాచర్లలో నిర్మించినప్పటికీ మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. భవనం కోసం బీసీ కార్పోరేషన్‌ నుంచి రూ.40లక్షలు నిధులు 2018లో మంజూరు చేయడంతో పూర్తిస్థాయిలో బీసీ భవనం నిర్మించాం. ఇంతవరకు నిధులు జమకాకపోవడంతో  భవనం ప్రారంభానికి నోచుకోలేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలి. 

- సూరా పాండురంగారెడ్డి

Updated Date - 2022-06-28T06:39:48+05:30 IST