జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకోండి

ABN , First Publish Date - 2022-08-24T06:15:24+05:30 IST

జగన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకోండి
సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి

మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఎర్రగొండపాలెం, ఆగస్టు 23: జగన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఎర్రగొండపా లెంలో మంగళవారం ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతు న్నాయా..?లేదా..? అని వాకాబు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయికుమార్‌, ఎంపీపీ డి కిరణ్‌గౌడ్‌, జడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్‌, సర్పంచి ఆర్‌ అరుణాబాయ్‌,పంచాయతీకార్యదర్శి రాజశేఖరరెడ్డి, శ్రీశైలం ట్రసు ్టబోర్డు మాజీడైరక్టరు యిమ్మడిశెట్టి వెంకటసుబ్బారావు, వైసీపీ నాయకులు యిమ్మడిశెట్టి సత్యనారాయణ, కందూరి కాశీవిశ్వనాథ్‌, సూరే రమేష్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పొదిలి : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. పొదిలి పట్టణంలో పడమటిపాలెం మసీదుతోట ప్రాంతాల్లో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాలలో తాగేం దుకు సాగర్‌నీరు కొన్నిరోజులుగా రాకపోవ డంతో నీటిని కొనుగోలు చేసి తాగుతున్నా మన్నారు. మరికొన్ని ప్రాంతాలలో వాడుకనీరు కూడా రాక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. అంతకుముందు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బి.వెంకటరత్నంకు రూ.1.10 లక్షలు,  చెన్నకేశవులు రూ.90వేలు, బి.రాంబాబు రూ.15వేల చెక్కులను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీల సంఘం అధ్యక్షుడు వాకా వెంకటరెడ్డి, వైసీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, కల్లం సుబ్బారెడ్డి, జి.శ్రీను, గూడూరి వినోద్‌, యక్కలి శేషగిరిరావు, నూర్జహాన్‌బేగం తదితరులు ఉన్నారు.

ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

రాచర్ల : ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. మండలంలోని చోళ్లవీడు గ్రామంలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే అన్ని పంచాయతీలలో సచివాలయాల నిర్మాణ కార్యక్రమం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ షేక్‌ ఖాశీంభీ, జడ్పీటీసీ సభ్యురాలు పగడాల దేవి, సర్పంచ్‌లు గోతం వెంకటనారాయణ, పగడాల రమేష్‌, శిరిగిరి రమేష్‌, తలపాటి దేవదానం, ముత్యాల మధు, డాక్టర్‌ బ్రహ్మారెడ్డి, సీఆర్‌ఐ మురళి, సూరా పాండురంగారెడ్డి, గోపీ, ఎంపీడీవో కవితాచౌదరి, తేజ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-24T06:15:24+05:30 IST