బీజేవైఎం మోటార్‌సైకిల్ ర్యాలీ
ABN , First Publish Date - 2022-08-08T06:00:45+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ అసమర్థ పాలన చేస్తోందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్ విమర్శించారు. తిరుపతి నుంచి అమరావతికి వెళుతున్న బీజేవైఎం ర్యాలీ ఆదివారం గిద్దలూరు వచ్చింది.

గిద్దలూరు, ఆగస్టు 7 : రాష్ట్రంలో వైసీపీ అసమర్థ పాలన చేస్తోందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్ విమర్శించారు. తిరుపతి నుంచి అమరావతికి వెళుతున్న బీజేవైఎం ర్యాలీ ఆదివారం గిద్దలూరు వచ్చింది. స్థానిక బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కుడు తప్ప పరిశ్రమల ఏర్పాటుకు చొరవ తీసుకోవడం లేదని విమర్శించారు. మహిళ సమస్యలను కూడా పరిష్కరించడం లేదన్నారు. మూడేళ్లలో అన్నిరంగాలలో రాష్ట్రం వెనుకబడి పోయిందని విమర్శించారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల లబ్ధిని పేర్లు మార్చి వేరే ఇతర పథకాలకు మళ్లించడం మినహా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమి లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు సాయిచరణ్, బీజేపీ నాయకులు రమేష్‌రెడ్డి, చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.