నేటి నుంచి రాయితీపై శనగ విత్తనాలు
ABN , First Publish Date - 2022-10-07T06:27:54+05:30 IST
మండలంలోని శనగపంట సాగు చేసుకునే రైతులకు ఈ నెల 7 శుక్రవారం నుంచి రైతుభరోసా కేంద్రాల్లో శనగ విత్తనాలకు ఓటీపీలు నమోదు చేయనున్నట్లు వ్యవసాయాధికారి వై.విజయభాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
గిద్దలూరు టౌన్, అక్టోబరు 6 : మండలంలోని శనగపంట సాగు చేసుకునే రైతులకు ఈ నెల 7 శుక్రవారం నుంచి రైతుభరోసా కేంద్రాల్లో శనగ విత్తనాలకు ఓటీపీలు నమోదు చేయనున్నట్లు వ్యవసాయాధికారి వై.విజయభాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రైతు ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకంతో ఆర్బీకేకు వెళ్లి శనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రాయితీపై జేజీ-11 రకం క్వింటా ధర రూ.6456 రూపాయలు ఉండగా రాయితీపై రూ.4842 అందజేస్తామన్నారు. 25శాతం రాయితీతో ప్రభుత్వం విత్తనాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాక్-2 రకం క్వింటా ధర రూ.8856 ఉండగా రూ.6642 అందజేస్తామన్నారు. గిద్దలూరు మండలంలో జేజీ-11 రకం 1609 క్వింటాళ్లు కాక్-2 రకం 99 క్వింటాళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి రైతు ఖరీఫ్‌లో ఈ-పంట నమోదుకు సంబంధించి అక్టోబరు 12 లోపు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు.