బైరి నరేష్‌ను శిక్షించాలి

ABN , First Publish Date - 2022-12-31T22:31:11+05:30 IST

అయ్యప్ప స్వామి పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై కేసు నమోదు చేసి శిక్షించాలని అయ్యప్ప భక్తులు డిమాండ్‌ చేశారు. స్వామి పుట్టుకను అవహేళన చేయడాన్ని నిరసిస్తూ దేవస్థాన భక్త సమా జం, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ, రాస్తారోకో నిర్వహిం చారు.

బైరి నరేష్‌ను శిక్షించాలి

అయ్యప్ప భక్తుల ర్యాలీ, రాస్తారోకో

పామూరు, డిసెంబరు 31 : అయ్యప్ప స్వామి పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై కేసు నమోదు చేసి శిక్షించాలని అయ్యప్ప భక్తులు డిమాండ్‌ చేశారు. స్వామి పుట్టుకను అవహేళన చేయడాన్ని నిరసిస్తూ దేవస్థాన భక్త సమా జం, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ, రాస్తారోకో నిర్వహిం చారు. వీరికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీ రమణ, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ జయరామిరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్య క్షుడు, మాజీ సర్పంచ్‌ కావిటి సుబ్బయ్య, గుత్తి వెంకటరాజా, అర్చకులు చిమట పట్టాభిస్వామి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:31:11+05:30 IST

Read more