టీడీపీ కార్యకర్తలపై దాడి గర్హనీయం: కందుల
ABN , First Publish Date - 2022-06-26T07:16:51+05:30 IST
కొనకనమిట్ల మండలం ఎదురాళ్లపాడులో టీడీపీ నాయకులపై దాడి చేసిన నిందుతులను కఠినంగా శిక్షించాలని మార్కాపురం మాజీ ఎంఎల్ఎ కందుల నారా యణరెడ్డి డిమాండ్ చేశారు.

టీడీపీ కార్యకర్తలపై దాడి గర్హనీయం: కందుల
పొదిలి, జూన్ 25: కొనకనమిట్ల మండలం ఎదురాళ్లపాడులో టీడీపీ నాయకులపై దాడి చేసిన నిందుతులను కఠినంగా శిక్షించాలని మార్కాపురం మాజీ ఎంఎల్ఎ కందుల నారా యణరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులు గూండాల్లాగా ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని దమ్ముధైర్యం ఉంటే టీడీపీని ఎదుర్కోవాలని ఆయన సవాల్ విసిరారు. పంటపొలాలకు వెళ్లి వస్తున్న రైతు లపై గొడ్డలితో వైసీపీ నాయకులు దాడిచేయడం దుర్మార్గమన్నారు. ఈ విషయాన్ని అంత తేలికగా వదిలివేసే ప్రసక్తే లేదన్నారు. తమకు వ్యవస్థ మీద నమ్మకం ఉందని పోలీస్, రెవెన్యూ వ్యవస్థ ప్రజలకు అండగా ఉండి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల, పట్టణ టీడీపీ అధ్యక్షులు మీగడ ఓబుల్‌రెడ్డి, ముల్లాఖుద్దూస్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాటూరి పెద్దబాబు, టీడీపీ జిల్లా నాయకులు డాక్టర్ ఎస్డి.ఇమాంసా, సామంతపూడి నాగేశ్వరరావు, పొల్లా నరిసింహారావు, ఎస్ఎం.బాషా, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రసూల్, యాసిన్, గౌస్, మాజీ సర్పంచ్ కాటూరి చిన్నబాబు, మండలనాయకులు జ్యోతి మల్లిఖార్జున, ముని శ్రీను, సురేష్, మౌలాలి, దివ్వెల మురళీ,సందానీ, అల్లాభక్షు, ఖాదర్‌వలి, కాటూరి శ్రీను, కల్నాయక్ ఉన్నారు.